Samantha: సమంతను ఇంత స్టైలిష్ గా ఎప్పుడూ చూసి ఉండరు… అనారోగ్యం అని ఎవరన్నారు!

సమంత కళ్ళజోడు పెట్టుకుని షర్ట్, ప్యాంటు ధరించి చాలా గ్లామరస్ గా ఉన్నారు. సమంత లుక్ చూస్తే ఆమె మయోసైటిస్ తో బాధపడుతున్నారని అనిపించడం లేదు. అంత స్లిమ్ అండ్ ఫిట్ గా సమంత ఉన్నారు.

Written By: Shiva, Updated On : August 15, 2023 10:21 am

Samantha

Follow us on

Samantha: సమంత లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె ఆల్ట్రా స్టైలిష్ అవతార్ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. ఇంత అందగత్తె సమంతకు అనారోగ్యం ఏంటని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సమంత లేటెస్ట్ మూవీ ఖుషి. విజయ్ దేవరకొండ కి జంటగా సమంత నటిస్తుంది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో సమంత పాల్గొంటున్నారు. అందులో భాగంగా సమంత ఓ ఫోటో షూట్ చేశారు.

సమంత కళ్ళజోడు పెట్టుకుని షర్ట్, ప్యాంటు ధరించి చాలా గ్లామరస్ గా ఉన్నారు. సమంత లుక్ చూస్తే ఆమె మయోసైటిస్ తో బాధపడుతున్నారని అనిపించడం లేదు. అంత స్లిమ్ అండ్ ఫిట్ గా సమంత ఉన్నారు. ఇక ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగాయి. ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొనని కారణంగా సమంతను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.

వారికి తనదైన శైలిలో సమంత సమాధానం చెప్పింది. ఒకరి కోసం బ్రతకకండి. మీ స్థాయి గౌరవం పెచుకోండి, అందరిలో ఒకరిలా కాకుండా మీకంటూ గుర్తింపు తెచ్చుకోండి అంటూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఉద్దేశించే అని ప్రచారం జరిగింది. అలాగే సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేశారు. ఇది పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

సిటాడెల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సిరీస్. వరుణ్ ధావన్ మరో ప్రధాన రోల్ చేశారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇక ఏడాది పాటు సమంత సినిమాలు చేయరనే ప్రచారం జరుగుతుంది. సమంత అమెరికా వెళ్ళి చికిత్స తీసుకోనుందట. ఇందుకు ఓ హీరో వద్ద సమంత రూ. 25 కోట్లు అప్పుగా తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ రూమర్ ని సమంత కొట్టిపారేశారు.