Samantha: సమంత తాజా పోస్ట్ తో రెండో వివాహం ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ సోషల్ మీడియా పోస్ట్ అర్థం అదేనా? అంటూ నెటిజెన్స్ సందేహాలు వ్యక్తం చేశారు. నాగ చైతన్యతో సమంత విడిపోయి ఏడాది అవుతుంది. 2021 అక్టోబర్ లో వీరిద్దరూ విడాకుల ప్రకటన చేశారు. ప్రస్తుతానికి సమంత, నాగ చైతన్య ఒంటరిగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రం పెళ్లి రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ నడుపుతున్నారని కథనాలు వెలువడ్డాయి. శోభితతో నాగ చైతన్య చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడనే ప్రచారం జరిగింది.

ఈ వార్తలపై నాగ చైతన్య మౌనం వహించారు. శోభిత మాత్రం ఘాటుగా ఖండించారు. అలాగే ఆయనకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. రాంగ్ టైం లో సమంత, నాగ చైతన్య విడిపోయారు. ముఖ్యంగా సమంత వయసు 35 ఏళ్ళు. పెళ్లి చేసుకుంటే ఆమె ఆలస్యం చేయకుండా కానిచ్చేయాలంటే. లేదంటే ఏజ్ బార్ అవుతుంది. 40లకు దగ్గరయ్యాక పెళ్లి చేసుకున్నా అనవసరం. వయసంతా ఆవిరైపోయాక ప్రయోజనం ఉండదు.
ఆ మధ్య సమంత పెళ్లి వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. స్వామీజీ సద్గురు సలహా మేరకు ఆయన ఎంపిక చేసిన ఓ అబ్బాయిని వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా ఎలాంటి ఆధారాలు, సమంత పెళ్లి చేసుకోబోతున్నట్లు సూచనలు లేవు. కాగా సమంత లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ కొన్ని సందేహాలకు తావిచ్చింది. ఆమె తన టీషర్ట్ పై ఉన్న ఒక కొటేషన్ ని హైలెట్ చేస్తూ ఫోటో తీసి దాన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఆ ఇంగ్లీష్ కోట్ ని తెలుగులోకి అనువదిస్తే… ‘నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయలేవు’. ఈ క్రమంలో సమంత తోడు కోరుకుంటుంది, పెళ్లిపై హింట్ ఇస్తుందనే ఒక వాదన వినిపిస్తోంది. అదే సమయంలో ఆమె తన గురించి కాదు నాగ చైతన్యపై సెటైర్ వేసిందని అంటున్నారు. తోడు లేకుండా చైతూ బతకలేదని ఎద్దేవా చేస్తుందని అంటున్నారు. సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ అంతరార్థం తెలియాలంటే… కొద్ది రోజులు ఆగాల్సిందే. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమంత ఇప్పట్లో పెళ్లి చేసుకోకపోవచ్చు.