Samantha: హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. విడాకుల వేదన నుండి బయటపడిన సమంతను మాయ రోగం వెంటాడింది. దాదాపు ఆరు నెలలు సమంత ఇంటికే పరిమితమైంది. కొంచెం కోలుకున్నాక సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మయోసైటిస్ నుండి ఇంకా పూర్తిగా బయటపడలేదని సమంత తెలిపారు. శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత నీరసంగా కనిపించారు. ఓపిక లేని కారణంగా ఎక్కువ సేపు మాట్లాడలేకపోతున్నాను. పంటి బిగువన శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నానన్నారు.
తన కళ్ళు కాంతిని చూడలేకపోతున్నాయట. అందుకే కళ్ళ జోడు వాడింది. మానసిక ప్రశాంత కోసం జపమాల, తెల్లబట్టలో సమంత కనిపించడం విశేషం. కొన్నాళ్లుగా ఆమె పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. సిటాడెల్ షూటింగ్ లో కఠిన యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. అలాగే ఖుషి షూటింగ్ చకచకా పూర్తి చేస్తుంది. ఖుషి కేవలం క్లైమాక్స్ మిగిలి ఉందట. ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఒక ప్రక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది.
ఇదిలా ఉంటే… సమంత లేటెస్ట్ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఆమె ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ కోట్ షేర్ చేశారు. ప్రముఖ రచయిత పాబ్లో నెరుడా చెప్పిన కోట్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. సదరు కోట్ మీనింగ్ గమనిస్తే… ‘చావును ఆపలేనప్పుడు జీవితాన్ని ప్రేమతో బాగు చేసుకోవడమే’. చావు, ప్రేమ, జీవితం అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన నేపథ్యంలో కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
సమంత తన అనారోగ్యం గురించి చెప్పాలనుకున్నారా? లేక ప్రేమికుడు గురించి చెప్పాలనుకున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. కాగా సమంత ప్రేమలో పడ్డారంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా ఈ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇక 2021లో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. ఆమె వయసు 35 ఏళ్ళు దాటేసింది.