
Samantha: సమంత సోషల్ మీడియా ఫ్రీక్. చాలా విషయాలు తన అభిమానులకు షేర్ చేస్తారు. తనను ప్రేమించే వాళ్లతో టచ్ లో ఉండేందుకు ఇష్టపడతారు. ఇక సమంత చేసే కామెంట్స్, పోస్ట్స్ లోతైన భావాలు కలిగి ఉంటాయి. ఒక్కోసారి ఎవరినో టార్గెట్ చేస్తున్న భావన కలుగుతుంది. సమంతకు ఎవరిపై కోపం ఉండదు. ఉంటే గింటే నాగ చైతన్య మీద ఉండాలి. అది గతంలో రుజువైంది. ఆ కసి అలానే ఉందా లేక తగ్గిందా అనేది తెలియాల్సి ఉంది. సమంత లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్… పలు అనుమానాలకు దారితీసింది. ”ఎవరు ఏ సమస్యతో పోరాడుతున్నారో తెలియదు, అందరిపై దయ చూపండి” అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కామెంట్ పెట్టారు.
జనరల్ మీనింగ్ లో దాని అర్థం… సమంత అందరి మంచి కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు. ఎవరు ఏ సమస్యతో పోరాడుతున్నారో… అనడంలో ఏదో లోతైన అర్థం, అలాగే ఎవరి గురించో చెప్పినట్లుగా ఉంది. తాను ఇష్టపడే వాళ్ళు ఏదైనా సమస్యలో ఉన్నారని ఆమె తెలిసిందా? వాళ్ళతో మాటల్లేవు కాబట్టి తెలిసేలా ఇలా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిందేమో అనిపిస్తుంది. ఇక దాని వెనుకున్న అర్థం ఏదైనా కానీ సమంత అందరూ బాగుండాలని ఆశిస్తున్నారు.

కాగా సమంతపై బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, సమంత గురించి చెప్పాలని యాంకర్ అడిగారు. ఆమె చాలా హార్డ్ వర్కింగ్. సన్నివేశం కోసం తన శరీరాన్ని చాలా కష్టపెడతారు. ఆమె పనితీరు చూసి నేను ఆశ్చర్యపోయానని మనోజ్ బాజ్ పాయ్ చెప్పారు. అలాగే ‘ఏది పట్టించుకోకుండా ముందుకు సాగిపో’ అని సమంతకు సలహా ఇచ్చాడు. దీనిపై సమంత స్పందించారు. ‘నేను ప్రయత్నం చేస్తాను సర్’ అని రిప్లై ఇచ్చారు.
సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ షూట్లో పాల్గొంటున్నారు. ముంబై వేదికగా ఫస్ట్ షెడ్యూల్ నడుస్తుంది. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే సిటాడెల్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సిటాడెల్ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రం చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ఖుషి షూట్ తిరిగి ప్రారంభం కానుందని ఇటీవల శివ చెప్పారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.