
Samantha Ruthprabhu : కొన్నాళ్లుగా సమంత వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. నాగ చైతన్యతో విడాకులు ఆమె ఊహించని పరిణామం. టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోతారని ఎవరూ అనుకోలేదు. సమంతతో పాటు అభిమానులను కూడా బాధించిన అంశం. విడాకుల వేదన ఒక వైపు, నిందలు ఆరోపణలు మరోవైపు. సమంత తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. దాదాపు ఏడాది కాలం ఆమె ఈ బాధ అనుభవించారు.
ఆ సమస్య నుండి బయటపడిందో లేదో… మయోసైటిస్ రూపంలో మరో సమస్య ఆమె జీవితంలోకి ప్రవేశించండి. అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకున్నారు. నెలల తరబడి ఆమె కెమెరాకు దూరమయ్యారు. ఈ ప్రాణాంతక వ్యాధిని మనోధైర్యంతో ఎదిరించి నిలబడ్డారు. పూర్వ స్థితికి వచ్చారు. ప్రస్తుతం షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అయితే చాలా కాలం అనంతరం సమంత గ్లామరస్ ఫోటో షూట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్రెండీ డిజైనర్ వేర్ లో ముస్తాబైన సమంత అల్ట్రా మోడ్రన్ గర్ల్ గా ఆకట్టుకున్నారు. సమంత లుక్ చూసి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. సమంత ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఈ ఫోటో షూట్ చేశారు. ఈ క్రమంలో సమంత పూర్తిగా కోలుకున్నారని. ఇకపై ఆమె నుండి ఈ తరహా పోస్ట్స్ చూడవచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
ఇటీవల సమంత ఆధ్యాత్మిక అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. తెల్లని వస్త్రాల్లో, జపమాల చేతిలో పట్టుకుని తిరిగింది. సమంత తీరు చూసి జనాలు షాక్ అయ్యారు. సమంత ఏదైనా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారేమో, సినిమాలకు దూరం అవుతారేమో అని భయపడ్డారు. కాగా సమంత నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధమైంది. ఇక విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న ఖుషి చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. అలాగే యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ సెట్స్ పై ఉంది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తుండగా… రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు.