Samantha- Vijay Devarakonda: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ‘సమంత’ నటిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఈ సినిమా కథ గురించి కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా కథ కశ్మీర్ నేపథ్యంలో సాగుతుంది అని, ఇదొక లవ్ స్టోరీ అని, సినిమాలో విజయ్ దేవరకొండ పక్కా ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ లో స్టార్ట్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మొత్తానికి సమంత వరుస సినిమాలు ఒప్పుకుంటూ పోతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో కూడా సామ్ మరో సినిమా చేస్తుండేసరికి మొత్తానికి మళ్ళీ సామ్ ఫామ్ లోకి వస్తోంది అని ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.
Also Read: ‘డాడీ’ గా మెగాస్టార్.. ‘బ్రో’ గా నాని.. కలయిక అదిరిపోయింది !
పైగా సామ్ – విజయ్ దేవరకొండ గతంలో మహానటిలో కూడా కలిసి జోడీగా నటించారు. అయితే, ఇప్పటి సినిమాకి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. ఎలాగూ రొమాంటిక్ లవ్ స్టోరీ కాబట్టి.. సామ్ – విజయ్ మధ్య కూడా ఓ రేంజ్ రొమాన్స్ ఉంటుంది అట. అందుకే, సమంత ఈ సినిమాకి మూడు కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తోంది.
ప్రస్తుతం సమంత మైథాలాజికల్ మూవీ ‘శాకుంతలం’లో కూడా నటిస్తోంది. ఇప్పటికే సమంత ‘శాకుంతలం’ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు యశోద సినిమాతో పాటు ఓ హాలీవుడ్ సినిమా కూడా చేస్తోంది. ఇక రీసెంట్ గా శాకుంతలం సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే.
ఇందులో సమంత ప్రకృతిలో, వన్యప్రాణుల మధ్య సేద తీరుతూ అచ్చం దేవకన్యలా కనిపించింది. పురాణాల్లో దుష్యంతుడు, శకుంతల మధ్య ప్రేమ, విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం లాంటి అంశాలతో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

ఈ సినిమా కోసం సమంత నాలుగు కేజీలు బరువు ఉన్న ఆభరణాలను కూడా దరించింది. అలాగే మేకప్ కోసం కూడా సుమారు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని మరీ మేకప్ వేయించుకుంది. అందుకే సామ్, తన కెరీర్ లోనే ఇది స్పెషల్ ఫిల్మ్ గా ట్రీట్ చేస్తోంది. పైగా ఖర్చు విషయంలో కూడా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.
Also Read: ‘రాజమౌళి’ విజయాల వెనుక కారణం అదేనా ?