Samantha: హుటాహుటిన అమెరికాకు సమంత… ఆందోళనలో ఫ్యాన్స్!

ముఖ్యంగా ఖుషి విషయంలో సమంత బాగా ఇబ్బంది పడింది. ఆరోగ్యం సహకరించ పోవటంతో సినిమా బాగా ఆలస్యం అయ్యింది. చివరికి ఎలాగోలా సినిమాను పూర్తి చేసిన సమంత ట్రీట్మెంట్ కోసం మరోసారి అమెరికా పయనమైంది.

Written By: Shiva, Updated On : August 19, 2023 3:50 pm

Samantha

Follow us on

Samantha: నాగ చైతన్య కి విడాకులు ఇచ్చిన నాటి నుంచి ఏదో ఒక విధంగా సమంత వార్తల్లో కనిపిస్తూనే ఉంది. కొన్ని రోజులు డిప్రెషన్ కి లోనైందని, మరికొన్ని రోజులు ప్రశాంత కోసం దేవాలయాలు, ఆశ్రమాలకు వెళ్తుందని, మరి కొన్ని రోజులు ఆరోగ్యపరమైన ఆమె ఆరోగ్యపరమైన సమస్యల తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నిత్యం వార్తల్లో కనిపించేది సమంత.

సమంత మయో సైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే, మధ్యలో ఈ వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్లిన కానీ పూర్తిగా నయం కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు ట్రీట్మెంట్ తగ్గించి సహజమైన యోగ పద్ధతులు పాటిస్తూనే తాను కమిట్మెంట్ ఇచ్చిన యశోద, విజయ్ దేవరకొండ తో చేస్తున్న ఖుషి సినిమాలను త్వరగా పూర్తి చేసింది.

ముఖ్యంగా ఖుషి విషయంలో సమంత బాగా ఇబ్బంది పడింది. ఆరోగ్యం సహకరించ పోవటంతో సినిమా బాగా ఆలస్యం అయ్యింది. చివరికి ఎలాగోలా సినిమాను పూర్తి చేసిన సమంత ట్రీట్మెంట్ కోసం మరోసారి అమెరికా పయనమైంది. ఖుషి తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదు సమంత. ట్రీట్మెంట్ కి కనీసం ఒక ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. మెయిన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా చెక్ అప్ కోసం అమెరికా వెళ్లి రావాల్సి ఉంటుంది.

అందుకే ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తాజాగా హైదరాబాద్ నుండి న్యూయార్క్ కు బయలుదేరింది సమంత. కాబట్టి ఖుషి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, ప్రమోషన్ కి సమంత అందుబాటులో ఉండదు. ఈ విషయం తెలిసే ముందుగా ఖుషి యూనిట్ మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో చాలా యాక్టీవ్ గా కనిపించిన సమంత విజయ్ తో కలిసి లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆరోగ్యంగా తిరిగి వస్తాను.. మీ కోసం బ్లాక్ బస్టర్ ఇస్తాను అని సమంత ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే.