Samantha: అదేంటి ? సమంతను ఎందుకు తీసుకున్నారు ?

Samantha: ‘సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ సినిమాకి సంబంధించిన తాజాగా ఒక స్పెషల్ అప్ డేట్ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ మారిపోయిందట. ముందుగా ఊహించినట్టే ఈ సినిమాలో మొదట పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అయితే, ఇప్పుడు పూజా హెగ్డే ప్లేస్ లో సమంత జాయిన్ అయింది. ‘అదేంటి ? సామ్ ను ఎందుకు తీసుకున్నారు ?’ అంటూ పూజా […]

Written By: Shiva, Updated On : January 1, 2022 12:04 pm
Follow us on

Samantha: ‘సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ సినిమాకి సంబంధించిన తాజాగా ఒక స్పెషల్ అప్ డేట్ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ మారిపోయిందట. ముందుగా ఊహించినట్టే ఈ సినిమాలో మొదట పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అయితే, ఇప్పుడు పూజా హెగ్డే ప్లేస్ లో సమంత జాయిన్ అయింది. ‘అదేంటి ? సామ్ ను ఎందుకు తీసుకున్నారు ?’ అంటూ పూజా హెగ్డే ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు గానీ, సమంత ఫ్యాన్స్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Samantha

సామ్ నాగ చైతన్యతో విడిపోయిన దగ్గర నుంచి చాలా ఒత్తిడికి గురి అయింది. ఇక ఆ ఒత్తిడిలో నుంచి హీరోయిన్ నిద్ర లేచింది. ఎలాగైనా మళ్ళీ హీరోయిన్ గా బిజీ అయ్యేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. అవకాశాల కోసం మళ్ళీ ఎంతగానో కష్ట పడుతోంది. ఈ క్రమంలో ఆమె త్రివిక్రమ్ ను కలిసింది.

మరి సమంతకు గత వైబోగం రావాలి అంటే.. పెద్ద దర్శకుడి సినిమా రావాలి. అలాగే పెద్ద హీరో సినిమా అయి ఉండాలి. అప్పుడే సమంతకు మళ్ళీ బ్రేక్ వస్తోంది. అలాగే మళ్ళీ ఫామ్ లోకి వస్తోంది. మరి ఈ మధ్యలో ఎన్ని చిన్నాచితకా సినిమాలు చేసినా ఉపయోగం ఏమి ఉండదు. అందుకే త్రివిక్రమ్ ను కలిసింది. నిజానికి త్రివిక్రమ్ అప్పట్లో సమంతకు మంచి సన్నిహితుడు.

Also Read: ఆ డైరెక్టర్ ను బూతులు తిట్టేసిన సమంత !

ఆమె కూడా ఆయనను ఎంతగానో ప్రత్యేకంగా చూసేది. ఇక ఎలాగూ సామ్ విడాకుల వ్యవహారం కూడా ముగిసిన ముచ్చటగా మిగిలిపోయింది కాబట్టి.. సామ్ మళ్లీ ట్రెండింగ్ లోకి రావాలి అంటే త్రివిక్రమ్ – మహేష్ సినిమా చేయాల్సిందే. అందుకే, నేరుగా వెళ్లి తనకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంది. అందుకు తగ్గట్టుగానే సామ్ కి త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడు.

ఇక మహేష్ – త్రివిక్రమ్ కలయిక అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టు పదకొండు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. పైగా ఈ సినిమాని ‘పాన్ ఇండియా సినిమా’గా తీసుకురాబోతున్నారు. అన్నిటికీ మించి త్రివిక్రమ్ ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు, అటు మహేష్ కూడా వరుసగా సక్సెస్ లు అందుకున్నాడు. కాబట్టి.. ఈ సినిమాలో చేసే హీరోయిన్ కి కూడా దశ తిరగడం ఖాయం.

Also Read: ప్రభాస్-పూజాపై వచ్చిన ఆ రూమర్ నిజమే అనిపిస్తుంది

Tags