Samantha: ఇప్పటికే చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది సమంత. అక్టోబర్ 2 న నాగ చైతన్య తో విడిపోతున్నట్లు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది సామ్. అప్పటి నుండి సమంత – నాగ చైతన్య విడాకుల విషయం ఇండస్ట్రీలో కోడై కూస్తోంది.

ఇదిలా ఉండగా… సమంత విడాకుల తర్వాత సోషల్ మీడియా లో అంతకు ముందు ఉన్నట్లు ఇప్పుడు అంత చురుకుగా లేదు. ఏది ఏమైనప్పటికి విడాకుల తర్వాత తన జీవితాన్ని మళ్ళీ యధావిధిగా కొనసాగించుకోవాలని అనుకుంటుంది. రెండు రోజుల క్రితం.. పనులన్నీ మళ్లి మొదలు పెట్టాలి, షెల్ఫ్ లో పేరుకుపోయిన దుమ్ము దులపాలి, కలలు నిజం చేసుకోవాలంటే మధ్యాహ్నం వరకు నిద్ర పోకుడదంటూ.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే సమంత మళ్ళి తన జీవితాన్ని ఇంతకు ముందు ఎలా ఉందొ ఇప్పుడు కూడా అలానే ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటుందని పరోక్షం గా చెప్పకనే చెప్పుతుంది.
తాజాగా .. జెమినీ టీవీలో జూ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం లో సమంత రాబోతుందని తెలిసిపోయింది. అన్నపూర్ణ స్టూడియో షూట్ లొకేషన్ కి సంబంధించిన ఫొటోస్ ని సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో పెట్టి పెద్ద హింట్ ఏ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే సమంత తన రొటీన్ లైఫ్ ని యధావిధంగా కొనసాగించబోతుందని అర్థమవుతుంది.