https://oktelugu.com/

Samantha: సమంత అందుకే అంత ప్రత్యేకం… సక్సెస్ సీక్రెట్ అదే!

Samantha:  అదృష్టం అన్నివేళలా కాపాడదు. అదృష్టానికి టాలెంట్,హార్డ్ వర్క్ కూడా తోడైనప్పుడు లాంగ్ టర్మ్ కెరీర్ సాధ్యమవుతుంది. పరిశ్రమలో సమంతకు లక్కీ హీరోయిన్ అనే బ్రాండ్ నేమ్ ఉంది. ఏమాయ చేశావే చిత్రంతో మొదలైన సమంత విజయాల పరంపర కొనసాగుతోంది. ఆమె అడుగు పెట్టిన ప్రతి చోటా తన మార్కు చూపిస్తూ.. విజయం సాధిస్తుంది. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప లో సమంత ఐటెం సాంగ్ చేయగా సినిమాకు ప్రత్యేకంగా నిలిచింది. పుష్ప మూవీ చూసిన […]

Written By:
  • Shiva
  • , Updated On : December 18, 2021 / 11:54 AM IST
    Follow us on

    Samantha:  అదృష్టం అన్నివేళలా కాపాడదు. అదృష్టానికి టాలెంట్,హార్డ్ వర్క్ కూడా తోడైనప్పుడు లాంగ్ టర్మ్ కెరీర్ సాధ్యమవుతుంది. పరిశ్రమలో సమంతకు లక్కీ హీరోయిన్ అనే బ్రాండ్ నేమ్ ఉంది. ఏమాయ చేశావే చిత్రంతో మొదలైన సమంత విజయాల పరంపర కొనసాగుతోంది. ఆమె అడుగు పెట్టిన ప్రతి చోటా తన మార్కు చూపిస్తూ.. విజయం సాధిస్తుంది. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప లో సమంత ఐటెం సాంగ్ చేయగా సినిమాకు ప్రత్యేకంగా నిలిచింది.

    Samantha

    పుష్ప మూవీ చూసిన ప్రతివారు… అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ తర్వాత సమంత ఐటెం సాంగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఊ అంటావా ఊ ఊ అంటావా.. సాంగ్ పుష్ప సినిమాకు హైలెట్ అంటున్నారు. సమంత మాస్ స్టెప్స్, బోల్డ్ అటెంప్ట్ గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. సాంగ్ కోసం సమంత పరకాయ ప్రవేశం చేసిన తీరుకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సాంగ్ కంటెంట్, బ్యాక్ గ్రౌండ్ సమంత ప్రెజెన్స్ తో ఎలివేట్ అయ్యింది.

    ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేసిన సమంత సూపర్ సక్సెస్ అయ్యారు. దీంతో సమంత టాలెంట్ గురించి ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. చేసే పనిలో వంద శాతం అవుట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేసే సమంత ఏ ఫీల్డ్ లో అడుగు పెట్టినా విజయమే అంటున్నారు. సమంత ట్రాక్ రికార్డు కూడా అదే చెబుతుంది. ఆమె స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గా విజయం సాధించారు. అదే క్రమంలో నటనకు ప్రాధాన్యత ఉన్న ఓ బేబీ, యూ టర్న్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి సక్సెస్ అయ్యారు.

    సమంత నటించిన ఓ బేబీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. యూఎస్ లో వన్ మిలియన్ వసూళ్లు అందుకుని ట్రేడ్ వర్గాలను షాక్ కి గురిచేసింది. అలాగే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో సమంత తన మార్కు క్రియేట్ చేశారు. డెబ్యూ సిరీస్ తోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించారు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ విజయం టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అయ్యింది. ఆ సిరీస్ లో లేడీ రెబల్ గా సీరియస్ రోల్ చేసిన సమంత, కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించడం విశేషం.

    Also Read: Vijay Devarakonda: భయంలో విజయ్ దేవరకొండ.. డేట్స్ ఇవ్వాలా ? హ్యాండ్ ఇవ్వాలా ?

    సమంత సక్సెస్ కావడానికి కేవలం ఆమె అదృష్టం అనుకుంటే పొరపాటే. ఎంచుకున్న పాత్ర కోసం సమంత హార్డ్ వర్క్ చేస్తారు. పాత్ర డిమాండ్ మేరకు ఆంక్షలు పెట్టకుండా మాక్సిమమ్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎంచుకున్న రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయ పడతారు. అదే ఆమెను మిగతా హీరోయిన్స్ కంటే స్పెషల్ గా మార్చేసింది.

    Also Read: Akhanda Collections: అఖండ 15 రోజుల కలెక్షన్స్.. బాలయ్య కెరీర్ లోనే తొలిసారి ఇలా..

    Tags