Samantha : సమంత-నాగ చైతన్య సుదీర్ఘ కాలం ప్రేమించుకున్నారు. సమంత డెబ్యూ మూవీ ఏమాయ చేసావే. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో సమంత-నాగ చైతన్య జతకట్టారు. అప్పుడే వీరి ప్రేమకు బీజం పడిందట. ఆరేళ్ళకు పైగా రహస్యంగా ప్రేమించుకున్నారు. పెళ్ళికి ఓ ఏడాది ముందు సమంత-నాగ చైతన్య రిలేషన్ లో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇక 2017లో వివాహం చేసుకున్నారు. గోవా వేదికగా ఘనంగా సమంత, నాగ చైతన్యల వివాహం జరిగింది.
దాదాపు నాలుగేళ్లు వీరి కాపురం అన్యోన్యంగా సాగింది. ఒకరినొకరు గౌరవించుకుంటూ.. చాలా ప్రేమగా మెలిగేవారు. ఏమైందో తెలియదు.. విడిపోయారు. 2021 అక్టోబర్ నెలలో పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా నోట్ విడుదల చేశారు. అనంతరం సోషల్ మీడియా నుండి ఫోటోలు తొలగించారు. విడాకులు సమంతను వేదనకు గురి చేశాయని, ఆమె డిప్రెషన్ కి గురయ్యారని సమాచారం.
విడాకులకు ముందు నాగ చైతన్యతో కలిసి జీవించిన ఇంట్లోనే సమంత ఇప్పుడు ఉంటుంది. అలాగే సమంత నాగ చైతన్య పై తనకు ఉన్న ప్రేమకు గుర్తుగా రెండు టాటూలు వేయించుకుంది. రిబ్స్ కింద ‘చై’ అని ఇంగ్లీష్.. ఒక టాటూ వేయించుకున్నారు. అలాగే చేతి మీద మరొక టాటూ వేయించుకున్నారు. విడాకుల నేపథ్యంలో ఈ టాటూలు సమంత తొలగిస్తారని భావించారు. కానీ ఆమె వాటిని తీయలేదు.
డిసెంబర్ 4న నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్నాడు. ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం ముగిసింది. నాగ చైతన్య మరొక అమ్మాయికి భర్త అయ్యాడు. ఎప్పటికైనా చైతన్య తాలూకు టాటూలు ఆమె తొలగిస్తారేమో చూడాలి. ఇటీవల సమంత జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ”మళ్ళీ మనం కలిసేవరకు నాన్న” అంటూ సమంత హార్ట్ బ్రేక్ ఎమోజీ తో సమంత ఒక పోస్ట్ పెట్టింది. ఇది వైరల్ అయ్యింది. సమంత తండ్రి మరణానికి అభిమానులు సంతాపం ప్రకటించారు.
సమంత నటించిన సిటాడెల్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. నిర్మాణంలోకి కూడా సమంత అడుగుపెట్టింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసిన సమంత, మా ఇంటి బంగారం పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రకటించింది.