Samantha : విలక్షణమైన పాత్రలతో సౌత్ లో అన్నీ వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరించి హీరోలతో సరిసమానమైన సూపర్ స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సమంత..కేవలం హీరోల పక్కన హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సమంత..ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం యశోద ఈ నెల 11 వ తారీఖున ఘనంగా అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల కాబోతుంది.

సుమారు 40 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది..ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది..అయితే సమంత గత కొంత కాలం నుండి ‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది..ఈ విషయం స్వయంగా సమంతానే తెలియచేసింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సమంత ఈ వ్యాధితో బాధపడుతూ ఉండేదట..షూటింగ్ గ్యాప్ లో బాగా నీరసించి పడిపోయేదట..ఇక ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పే సమయం లో సమంత ఎంత ఇబ్బందికి గురైందో చెప్పుకొచ్చాడు ఆ చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్..తెలుగు డబ్బింగ్ తేలికగానే చెప్పిందని..కానీ తమిళ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బందికి గురైందని..హాస్పిటల్ బెడ్ మీద నుండే ఆమె డబ్బింగ్ ని పూర్తి చేసిందని చెప్పుకొచ్చాడు.
‘అంత ఇబ్బంది పడుతూ డబ్బింగ్ చెప్పడం ఎందుకు..నేను వేరే వారితో చెప్పిస్తాను’ అని సమంత తో అన్నాడట కృష్ణ ప్రసాద్ గారు..కానీ సమంత ‘నాకు బాగా అలవాటైన భాష..నేను చెప్తేనే సహజం గా ఉంటుంది’ అని పట్టుబట్టి చెప్పిందట..ఇంత డెడికేషన్ తో ఒక హీరోయిన్ పని చెయ్యడం నా కెరీర్ లో ఎప్పుడూ చూడలేదని..సమంత అద్భుతమైన నటి అని చెప్పుకొచ్చాడు..’సరోగసి’ ద్వారా బిడ్డకి జన్మని ఇవ్వడానికి ఒప్పుకున్న ఒక తల్లికి ఎదురైనా ఊహించని సంఘటనల నేపథ్యం లో ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ హరీష్ నారాయణ్..చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరుకు ఆకట్టుకుంటుంది అనేది.