Samantha Ruth Prabhu : సమంత ఆరోగ్యంపై సంచలన విషయం చెప్పిన ఆమె సన్నిహితులు

Samantha Ruth Prabhu : సమంత అనారోగ్య ప్రకటన చేసినప్పటి నుండి అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే… సమంత కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆమె మెరుగైన చికిత్స కోసం దేశవిదేశాల పర్యటిస్తున్నారు. ఇప్పట్లో షూటింగ్ కి హాజరయ్యే సూచనలు లేవు. ఈ క్రమంలో బాలీవుడ్ మేకర్స్ ఆమెను సైన్ చేసిన ప్రాజెక్ట్స్ నుండి తప్పించారు. ఇలా పలు నిరాధార కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో మీడియా వర్గాలు […]

Written By: NARESH, Updated On : January 3, 2023 8:53 pm
Follow us on

Samantha Ruth Prabhu : సమంత అనారోగ్య ప్రకటన చేసినప్పటి నుండి అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే… సమంత కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆమె మెరుగైన చికిత్స కోసం దేశవిదేశాల పర్యటిస్తున్నారు. ఇప్పట్లో షూటింగ్ కి హాజరయ్యే సూచనలు లేవు. ఈ క్రమంలో బాలీవుడ్ మేకర్స్ ఆమెను సైన్ చేసిన ప్రాజెక్ట్స్ నుండి తప్పించారు. ఇలా పలు నిరాధార కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో మీడియా వర్గాలు అసలు విషయం రాబట్టే ప్రయత్నం చేశారు. సమంత సన్నిహితులను సంప్రదించడం జరిగింది. సమంత ఫ్రెండ్ ఆమె ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు.

సమంత స్ట్రాంగ్ విమెన్. విడాకుల విషయంలో వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కొన్ని వర్గాలు ఆమెను మానసిక వేదనకు గురి చేశారు. అలాంటి సామాజిక దాడులను కూడా సమంత తట్టుకొని నిలబడ్డారు. సమంతకు ఈ వ్యాధిని ఎదుర్కోవడం చాలా చిన్న విషయం. సమంత పూర్తిగా కోలుకున్నారు. మునుపటికి మించిన ఎనర్జీతో షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. త్వరలో యధావిధిగా సమంత సినిమా షెడ్యూల్స్ కి హాజరవుతారని చెప్పుకొచ్చారట.

ఇక బాలీవుడ్ ప్రాజెక్ట్స్ సమంత క్యాన్సిల్ చేసుకున్నారనే వార్తలను కూడా సన్నిహిత వర్గాలు ఖండించాయట. సిటాడెల్ సిరీస్ రద్దయ్యింది. సమంత నటించడం లేదనేది పుకారు మాత్రమే. సిటాడెల్ సిరీస్ లో ముందుగా అనుకున్న ప్రకారం సమంత నటిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుందని వెల్లడించారట. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ దర్శక ద్వయం రూపొందించిన ఫ్యామిలీ మాన్ 2లో సమంత నటించారు. ది ఫ్యామిలీ మాన్ 2 భారీ సక్సెస్ అందుకుంది.

అలాగే 80 శాతం ఖుషి చిత్ర షూటింగ్ పూర్తి చేసిన సమంత, మిగిలిన చిత్రీకరణ కూడా కంప్లీట్ చేస్తారంటూ సన్నిహిత వ్యక్తి చెప్పుకొచ్చారట. త్వరలో సమంత ఖుషి చిత్ర షూటింగ్ లో జాయిన్ అవుతారని విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తాజా సమాచారంతో చెక్ పడింది. గత ఏడాది అక్టోబర్ లో సమంత తనకు మయోసైటిస్ సోకినట్లు తెలియజేశారు. సమంత ఆరోగ్య పరిస్థితిపై చిత్ర ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నారన్న వార్త అందరిలో ఆనందం నింపనుంది. సమంత లేటెస్ట్ రిలీజ్ యశోద విజయం సాధించింది.