
అక్కినేని వారింట కోడలు అయ్యింది కనుక ఇక ‘సమంత’ చిత్ర పరిశ్రమకి గుడ్ బై చెప్పేసి అత్త అమల గారిలా హౌస్ వైఫ్ అయిపోతుందని, తమని ఇంతకాలం నటనతో, హాట్ హాట్ అందాలతో అలరించిన భామ కంటికి కానరాదేమోనని అభిమానులు ఆందోళన చెందారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ పెళ్ళికి ముందు కన్నా తర్వాతనే మరిన్ని సినిమాలతో, ఫోటో షూట్స్ లో ఇంకొంచెం ఎక్కువ అందాల ప్రదర్శనతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ కి టచ్ లో ఉంటూ తన గురించి అప్డేట్స్ ఇస్తుంది.
సోషల్ మీడియా ఫాలోయర్స్ లో రకరకాల వ్యక్తిత్వం కలవారుంటారు కనుక అప్పుడప్పుడు పోగొడ్తలతో పాటు ట్రోలింగ్ కూడా జరుగుతుంది. సమంతా మిగిలిన హీరోయిన్స్ తో పొలిస్తే కాసంత ఎక్కువగానే యాక్టీవ్ గా ఉంటూ క్రేజ్ ని పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలో అనేక సార్లు ఆమె విపరీతమైన ట్రోలింగ్ కి గురైంది. రీసెంట్ గా సమంత ఇంస్టాగ్రామ్ ఖాతా లో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ… ట్రోలింగ్ ని మీరెలా మేనేజ్ చేస్తారని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ… వింత ఏంటంటే ఇకపై నన్ను అవి ప్రభావితం చెయ్యలేవు, ఒకప్పుడు వాటి వల్ల నిద్రలేని రాత్రులు గడిపాను, కానీ ఇప్పుడు వాటిని చూస్తూ నవ్వుకుంటున్నాను. వ్యక్తిగా పరిణితి చెందానని అనుకుంటున్నానని చాలా బాగా చెప్పారు.
ఇటీవలే ఆహా ఓటిటీ లో సమంత అక్కినేని హోస్ట్‌గా ‘సామ్ జామ్’ షో మొదటి సీజన్ చేసి ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ పలు భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి నెలలో విడుదల కానుంది. ఇటీవలే గుణశేఖర్ రూపొందించనున్న ‘శాకుంతలం’ సినిమాలో లీడ్ రోల్ లో సమంతను కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.