https://oktelugu.com/

Samantha: తన తల్లితో చేసిన వాట్సాప్​ చాట్​ను నెట్టింట్లో షేర్​ చేసిన సమంత.. అందులో ఏముందో తెలుసా?

Samantha: ప్రముఖ టాలీవుడ్​ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కెరీర్​లో దూకుడు పెంచింది. వరుస సినిమాలకు ఓకే చెప్తూ..  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విభిన్న కథాంశాలున్న చిత్రాలతో పాటు, విభిన్న పాత్రలున్న సినిమాలకు ఓకె చెప్తోంది సామ్​. కాగా, చైతూతో విడాకుల ప్రకటన తర్వాత ఈ ప్రాజెక్టులకు సైన్ చేయడం గమనార్హం. మరోవైపు, సోషల్​మీడియాలోనూ ఇటీవలే యాక్టీవ్​గా ఉంటోంది సామ్​.. క్రమంలోనే మై మమ్మా సెడ్​( మా అమ్మ చెప్పింది) అనే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 12:06 PM IST
    Follow us on

    Samantha: ప్రముఖ టాలీవుడ్​ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కెరీర్​లో దూకుడు పెంచింది. వరుస సినిమాలకు ఓకే చెప్తూ..  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విభిన్న కథాంశాలున్న చిత్రాలతో పాటు, విభిన్న పాత్రలున్న సినిమాలకు ఓకె చెప్తోంది సామ్​. కాగా, చైతూతో విడాకుల ప్రకటన తర్వాత ఈ ప్రాజెక్టులకు సైన్ చేయడం గమనార్హం. మరోవైపు, సోషల్​మీడియాలోనూ ఇటీవలే యాక్టీవ్​గా ఉంటోంది సామ్​.. క్రమంలోనే మై మమ్మా సెడ్​( మా అమ్మ చెప్పింది) అనే హ్యాష్​ట్యాగ్​తో వరుసగా పోస్టులు పెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది సమంత.

    తాజాగా, తన తల్లితో చేసిన వాట్సాప్ చాట్​కు సంబంధించిన ఓ సీన్​ను బయట పెట్టింది సామ్​. నాలోని కొత్త దనం నీకు తెలేదు.. విరిగిపోయిన నా ముక్కలన్నింటినీ తిరిగి అతిగిస్తా.. అని రాసిన ఓ కొటేషన్​ను సామ్​కు తన తల్లి వాట్సాప్​లో షేర్​ చేసింది. దీంతో పాటు.. గాడ్​బ్లెస్​ యూ మై బేబీ అంటూ ఓ మెసేజ్​ కూడా పంపింది. దీనికి సంబంధించిన స్క్రీన్​షాట్​ను సామ్​ ఇన్​స్టా స్టోరీలో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్​గా మారింది. కూతురిపై తల్లి ఉన్న ప్రేమ ఎలాంటిదో ఈ పోస్ట్ చెబుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    కాగా, ప్రస్తుతం సామ్ శాకుంతలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. దీంతో పాటు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్​లో నటించనుంది. మరోవైపు హాలీవుడ్​లోనూ అరంగేట్రం చేయనుంది సామ్​.