Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. సమంత సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. అందుకే ఆమె కెరీర్ బిగినింగ్ నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే గత కొంతకాలంగా పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. నాగ చైతన్య తో విడాకులు, అదే సమయంలో మాయోసైటిస్ బారినపడి డిప్రెషన్ కు గురైంది. నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన నాలుగేళ్లకే వైవాహిక బంధానికి ముగింపు పలికారు. తాము ఇకపై కలిసి ఉండలేమంటూ అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు.
ఈ జంట విడిపోయి రెండేళ్లు అవుతున్నా వారి గురించి ఏదో ఒక వార్త తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటుంది. తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ కథనాలు వెలువడుతున్నాయి. నాగ చైతన్య మీద కోపంతో సమంత ఈ నిర్ణయం తీసుకుంది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తుంది. గతంలో కూడా చాలా సార్లు సమంత రెండో పెళ్లిపై రూమర్స్ వచ్చాయి.
ఓ సందర్భంలో రెండో పెళ్లి వార్తలపై సమంత స్పందిస్తూ .. మరో పెళ్లి చేసుకునే ఆసక్తి ఏమాత్రం తనకు లేదని.. పైగా విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఎక్కువగా విడిపోతున్నారు అంటూ కామెంట్స్ చేసింది. కాబట్టి సమంత రెండో వివాహం మీద వస్తున్న పుకార్లలో ఏమాత్రం నిజం లేదు. ఇక ఖుషి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. పలు దేశాల్లో సమంత సంచరించింది. కొద్ది రోజులగా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటుంది.
ఇక త్వరలో సమంత వెబ్ సిరీస్ సిటాడెల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సిరీస్ కి డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు షేర్ చేసింది. ఇది హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి రీమేక్ గా ఇండియన్ వెర్షన్ లో వస్తుంది. సిటాడెల్ కోసం సమంత కఠిన యాక్షన్ స్టంట్స్ చేశారు. సమంత యాక్షన్ అవతార్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. నెక్స్ట్ రామ్ చరణ్ కి జంటగా దర్శకుడు బుచ్చిబాబు మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Web Title: Samantha ready for second marriage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com