https://oktelugu.com/

Heroines Side Businesses : ఈ హీరోయిన్స్ కి ఉన్న సైడ్ బిజినెస్ లు తెలుసా… మామూలు ముదుర్లు కాదు!

Heroines Side Businesses : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ విషయం ఈ కాలం హీరోయిన్స్ కి బాగా తెలుసు. ఇండస్ట్రీలోకి రావడంతో పక్కా కమర్షియల్ గా మారిపోతున్న హీరోయిన్స్ రెండు చేతులా సంపాదించే ప్రణాళికలు రచిస్తున్నారు. తమ నేమ్, ఫేమ్ వాడుకొని సొమ్ము చేసుకోవాలి అనుకుంటున్నారు. సినిమా పరిశ్రమ చాలా అస్థిరతతో కూడినది. ఇమేజ్, స్టార్డమ్ ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేం. వరుసగా రెండు మూడు ప్లాప్స్ పడితే దుకాణం సర్దుకోవాల్సిందే. అందులోనూ ఈ జనరేషన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2022 / 08:58 PM IST
    Follow us on

    Heroines Side Businesses : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ విషయం ఈ కాలం హీరోయిన్స్ కి బాగా తెలుసు. ఇండస్ట్రీలోకి రావడంతో పక్కా కమర్షియల్ గా మారిపోతున్న హీరోయిన్స్ రెండు చేతులా సంపాదించే ప్రణాళికలు రచిస్తున్నారు. తమ నేమ్, ఫేమ్ వాడుకొని సొమ్ము చేసుకోవాలి అనుకుంటున్నారు. సినిమా పరిశ్రమ చాలా అస్థిరతతో కూడినది. ఇమేజ్, స్టార్డమ్ ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేం. వరుసగా రెండు మూడు ప్లాప్స్ పడితే దుకాణం సర్దుకోవాల్సిందే. అందులోనూ ఈ జనరేషన్ హీరోయిన్స్ కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఐదేళ్లు ఫార్మ్ లో ఉంటే గ్రేట్. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఈ కాలం హీరోయిన్స్ ఆర్థిక భరోసా ఏర్పాటు చేసుకుంటున్నారు.

     

    తమ సంపాదనను పెట్టుబడిగా పెట్టి బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు. సడన్ గా కెరీర్ కొలాప్స్ అయినా… చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆర్ధిక సమస్యలు లేకుండా జీవనం సాగించవచ్చని నమ్ముతున్నారు. సమంత, రకుల్, కాజల్, తమన్నాతో పాటు పలువురు హీరోయిన్స్ వ్యాపారాలు చేస్తున్నారు. మరి మన స్టార్ లేడీస్ ఎవరెవరు ఏం వ్యాపారాలు చేస్తున్నారో చూద్దాం… రకుల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. తనకు వ్యాయామ శిక్షణలో అనుభవం ఉంది. దీంతో రకుల్ ఫిట్నెస్ స్టూడియో నడుపుతున్నారు.

    ఇక తమన్నా చాలా కాలంగా జ్యువెలరీ డిజైన్ వ్యాపారం చేస్తున్నారు. పసిడి ప్రియులకు నచ్చే అద్భుతమైన డిజైన్స్ అందించే వ్యాపారం చేస్తున్నారు. ఇక సమంత చాలా రోజుల క్రితమే ఒక గార్మెంట్ బ్రాండ్ స్టార్ట్ చేశారు. తన బ్రాండ్ నేమ్ పై లగ్జరీ ఫ్యాషన్, డిజైనర్ వేర్స్ అందుబాటులోకి తెస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ లేడీ అలియా భట్ కి ఆల్రెడీ కిడ్స్ వేర్ బిజినెస్ ఉంది. ఇటీవల ప్రెగ్నెన్సీ పీరియడ్ చూసిన ఆమెకు సరికొత్త ఆలోచన తట్టింది. గర్భం దాల్చిన మహిళల కోసం అందమైన,సౌకర్యవంతమైన డిజైన్స్ రూపొందించి అమ్మకాలు జరుపుతున్నారు.

    ఇక కాజల్ భర్త గౌతమ్ కిచ్లుకి సొంతగా ఫర్నిచర్ బిజినెస్ ఉంది. వివాహం తర్వాత ఆమె కిచ్లు బ్రాండ్ కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా ఫ్యామిలీ బిజినెస్ ని డెవలప్ చేసే పనిలో పడ్డారు. ఇక అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత సుభాష్ బెంగుళూరులో హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ప్రణీత హోటల్ బ్రాండ్ కి అక్కడ డిమాండ్ ఉంది. వీరితో పాటు శ్రియ శరన్, తాప్సిలకు కూడా కొన్ని బిజినెస్ లు ఉన్నాయి. ఆ విధంగా అటు నటీమణులుగా ఇటు బిజినెస్ ఉమెన్స్ గా రాణిస్తున్నారు.