Samantha Raj Marriage : ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నేడు తెల్లవారు జామున కోయంబత్తూరు లో తన ప్రియుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) ని వివాహం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ లో అధికారికంగా పోస్ట్ చేసింది. సమంత రెండవ పెళ్లి చేసుకున్నందుకు ఆమె అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. అంతే కాదు, టాలీవుడ్ కి చెందిన ప్రముఖ సెలబ్రిటీలందరూ ఆమెకు ఇన్ స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసారు. గత రెండు మూడేళ్ళ నుండి వీళ్లిద్దరి మధ్య రిలేషన్ నడుస్తోంది. కొంతకాలం నుండి ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ చేస్తున్నారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రాజ్ తో రిలేషన్ లో ఉన్నట్టు సమంత ఎన్నోసార్లు అతనితో కలిసున్న ఫోటోలను అప్లోడ్ చేసి, అభిమానులకు చెప్పకనే చెప్పింది. ఇంకా ఎంత కాలం ఈ డేటింగ్, తొందరగా పెళ్లి చేసుకోండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉండేవారు.
వాళ్ళ కోరిక ఎట్టకేలకు నేడు నెరవేరింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ షూటింగ్ సమయం లో మొదలైన వీళ్లిద్దరి పరిచయం ఇలా పెళ్లి వరకు దారి తీస్తుందని అటు సమంత కానీ, ఇటు రాజ్ నిడిమోరు కానీ ఊహించి ఉండరు. ఆ సమయం లో సమంత నాగచైతన్య తో వైవాహిక బంధం లో ఉంది. విధి వాళ్ళిద్దరిని దూరం చేసింది, వీళ్ళిద్దరిని ఒకటి చేసింది. ఇదంతా పక్కన పెడితే పెళ్ళైన మొదటి రోజే సమంత కి రాజ్ ఊహించని సర్ప్రైజ్ ని అందించాడట. ఆమె కోసం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఒక అందమైన ఇంటిని నిర్మించాడట. ఈ విషయాన్ని ఇన్ని రోజులు సమంత కి కూడా చెప్పలేదట. చాలా సీక్రెట్ సర్ప్రైజ్ గా దీన్ని ప్లాన్ చేసి, నేడు వివాహం జరిగిన వెంటనే ఆమె చేతుల్లో ఇంటి తాళాలు పెట్టి షాక్ కి గురి చేసాడట. ఊహించని సర్ప్రైజ్ ఇవ్వడం తో సమంత కూడా ఒక్కసారిగా నోరెళ్లబెట్టినట్టు సమాచారం. వీళ్లిద్దరు జంటగా త్వరలోనే ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేయబోతున్నారట.