Samantha Yashoda Movie Release Date: ఆగస్టు 12న ‘యశోద’గా రాబోతున్న సమంత

Samantha Yashoda Movie Release Date: నాలుగేళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాక, సమంత సరికొత్త సినిమాలు అంగీకరిస్తూ ముందుకు పోతుంది. ఈ క్రమంలో సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘యశోద’. ఈ చిత్రంతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల […]

Written By: Shiva, Updated On : April 6, 2022 11:13 am
Follow us on

Samantha Yashoda Movie Release Date: నాలుగేళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాక, సమంత సరికొత్త సినిమాలు అంగీకరిస్తూ ముందుకు పోతుంది. ఈ క్రమంలో సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘యశోద’. ఈ చిత్రంతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్టు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఇవాళ వెల్లడించారు.

Samantha Yashoda Movie Release Date

మొత్తానికి సమంత సరికొత్త ప్రయాణం మొదలు పెట్టింది. భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తూ కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్న సమంత రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్. ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట.

Also Read: Naina Ganguly- Apsara Rani: ఇదేం వీడియోరా నాయ‌నా.. నైనా గంగూలీ, అప్స‌రా రాణిల ఘాటు రొమాన్స్‌, లిప్ లాక్స్‌..

విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.3 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారట. ఇదే బ్యానర్ కింద వచ్చిన పుష్పలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సామ్ రూ.1.5 కోట్లు తీసుకుంది. పూజా హెగ్డే రూ.3.5 కోట్లు, రష్మిక రూ.3 కోట్లు తీసుకుంటున్నారు. ఇక నాగచైతన్యతో విడాకుల వ్యవహారం, అలాగే సామ్ ఎఫైర్లు అంటూ వచ్చిన లేనిపోని పుకార్లు, ఇక ఆ పుకార్ల ప్రభావం నుంచి సమంత ఇప్పుడిప్పుడే బయట పడుతుంది.

Samantha Yashoda Movie Release Date

ఒక విధంగా తన జీవితంలో వచ్చిన అతి పెద్ద కష్టం నుంచి సమంత చాలా త్వరగా బయటపడినట్టే. అందుకే, పాత జ్ఞాపకాలన్నిటినీ మరచిపోవాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో బాధలన్నిటినీ మర్చిపోయింది. మరి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే, గతం తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేయాలి కదా. కాబట్టి వదిలేసింది.

కాగా ఈ 2022లో ఎంతో బలంగా, ఎంతో తెలివిగా, అలాగే దయగల వ్యక్తిగా ఉంటానని, తనతోపాటే అందరూ అలాంటి లక్షణాలు అలవరచుకోవాలని మెసేజ్ చేసింది. మొత్తానికి సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Also Read:Dharmana Krishna Das: ‘ధర్మ’యుద్ధం.. ధర్మాన కుటుంబంలో పదవుల చిచ్చు

Tags