‘పెళ్ళైతే’ నాకేం తక్కువ అంటున్న సమంత

సాధారణంగా హీరోయిన్లు తమ కెరీర్ ముగిసిపోతుంది అనుకొంటున్న టైములో పెళ్లి చేసుకొంటారు. కానీ అక్కినేని వారి కోడలు అలా కాదు. పెళ్లి అయినా కూడా తన కెరీర్ ని జాగ్రత్తగా కాపాడుకొంటూ వస్తోంది . ఇంకా చెప్పాలంటే పెళ్లి అయ్యాకే సమంత క్రేజ్ ఇంకా పెరిగింది. జనరల్ గా హీరోయిన్ లకు పెళ్ళైన తర్వాత ఫేడౌట్ అయిపోతారు.. వారికి అవకాశాలు రావు. అది చాలా వరకూ నిజమైంది కూడా . అయితే అక్కినేని సమంత మాత్రం ఆ […]

Written By: Neelambaram, Updated On : March 19, 2020 12:32 pm
Follow us on

సాధారణంగా హీరోయిన్లు తమ కెరీర్ ముగిసిపోతుంది అనుకొంటున్న టైములో పెళ్లి చేసుకొంటారు. కానీ అక్కినేని వారి కోడలు అలా కాదు. పెళ్లి అయినా కూడా తన కెరీర్ ని జాగ్రత్తగా కాపాడుకొంటూ వస్తోంది . ఇంకా చెప్పాలంటే పెళ్లి అయ్యాకే సమంత క్రేజ్ ఇంకా పెరిగింది. జనరల్ గా హీరోయిన్ లకు పెళ్ళైన తర్వాత ఫేడౌట్ అయిపోతారు.. వారికి అవకాశాలు రావు. అది చాలా వరకూ నిజమైంది కూడా . అయితే అక్కినేని సమంత మాత్రం ఆ చరిత్రను తిరగ రాస్తూ దూసుకుపోతుంది. నాగ చైతన్య తో పెళ్ళైన తరువాత తన క్రేజ్ ను డబుల్ చేసుకుంది.

ఇప్పుడు సమంత స్టార్ రేంజ్ లో దూసుకు పోతోంది..ఆ క్రమంలో ‘రంగస్థలం’ ‘మజిలీ’ ‘ఓ బేబీ’ వంటి వరుస విజయాల్ని అందుకుంది. ఇటీవల వచ్చిన ‘జాను’ చిత్రం మాత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు.. అయితే సమంత నటనకి మాత్రం మంచి అపలాజ్ వచ్చింది. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే సమంత ఇప్పుడు మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకొంది. రీసెంట్ గా హైదరాబాద్ టైమ్స్ వారు తాజాగా చేసిన సర్వేలో ‘మోస్ట్ డిజైరబుల్ విమెన్ -2019’ లిస్ట్ లో సమంత మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. పెళ్లి కెరీర్ కు ఏ మాత్రం అడ్డం కాదు అన్న విషయాన్ని సమంత మరోసారి ప్రూవ్ చేసింద ఇంకో ఆశ్చర్య కర విషయం ఏమిటంటే ఇదే సర్వే లో నటి అదితి రావు నాల్గవ స్తానం లో రాగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే అయిదవ స్థానంలో నిలిచింది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ఏడవ స్థానం లో ,కాజల్ ఎనిమిదవ స్థానం లో , రష్మిక మందన్న తొమ్మిదో స్థానం లోఉండగా మిల్కీ బ్యూటీ తమన్నా 22 వ స్థానం లో నిలిచింది అని సర్వే చెబుతోంది.
Marriage is not an hurdle