https://oktelugu.com/

Samantha : సమంతను పిచ్చగా ప్రేమించేది ఎవరో తెలుసా? ఆ ప్రేమకు సాటి లేదట, స్టార్ లేడీ ఓపెన్ కామెంట్స్

తనలా నన్ను ఎవరూ ప్రేమించలేరని, అదే సాటి లేని ప్రేమ అంటూ ఓపెన్ అయ్యింది సమంత. ఆమె సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సమంత కామెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ సమంత సోషల్ మీడియా పోస్ట్ సారాంశం ఏమిటో చూద్దాం.

Written By:
  • S Reddy
  • , Updated On : December 9, 2024 / 07:53 PM IST

    Samantha

    Follow us on

    Samantha :  సమంత భర్తతో విడిపోయి మూడేళ్లు అవుతుంది. హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత 2021లో విడాకులు ఇచ్చింది. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు వెల్లడించారు. సమంత విడాకుల వార్త ఆమె అభిమానులను కలచి వేసింది. లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. మరలా కలిస్తే బాగుండు అనుకున్నారు. సమంత మానసిక వేదనకు గురైంది. ఆమె డిప్రెషన్ నుండి బయటపడేందుకు స్నేహితులతో ఆధ్యాత్మిక యాత్రలు చేసింది.

    సమంత ప్రస్తుతం సింగిల్. హైదరాబాద్ నివాసంలో ఆమె ఒకరే ఉంటారు. నాగ చైతన్య-సమంత పెళ్లయ్యాక ఎంతో ఇష్టపడి ఒక పెంట్ హౌస్ కొనుక్కున్నారు. అక్కడే వారిద్దరూ ఉండేవారు. కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనతో దాన్ని అమ్మేశారు. ఆ ఇంటి నిర్మాణం పూర్తి కాకముందే విడిపోయారు. సమంత తిరిగి పెంట్ హౌస్ కొనుగోలు చేసింది. ఆమె ఆ పెంట్ హౌస్లోనే ఉంటారు.

    సమంత ఇంట్లో ఉంటే పెట్ డాగ్స్ తో ఆడుకుంటుంది. ఆమె వద్ద హ్యాష్, సాషా అనే రెండు డాగ్స్ ఉన్నాయి. వీటిని ప్రాణానికి ప్రాణంగా సమంత ప్రేమిస్తుంది. వాటితో గడపడానికి ఇష్టపడుతుంది. హ్యాష్ నాగ చైతన్యతో విడిపోక మునుపటి నుంచి ఉంది. సాషాను అనంతరం తెచ్చుకుంది. సాషాతో దిగిన ఫోటో షేర్ చేసిన సమంత ‘నో లవ్ లైక్ సాషా లవ్” అని కామెంట్ పెట్టింది. సాషాలా తనను ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించరు. సాషా ప్రేమకు సాటి లేదని అర్థం వచ్చేలా ఆ కామెంట్ ఉంది.

    ఇటీవల నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోగా… సమంత పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా సమంత మీద కూడా ఇటీవల ఒక రూమర్ వచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్.. దర్శకుడు రాజ్ తో సమంత రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ బాలీవుడ్ కథనాలపై సమంత స్పందించలేదు. ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి కూడా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.

    కాగా సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ బ్యానర్ లో సమంత మా ఇంటి బంగారం టైటిల్ తో ఒక మూవీ ప్రకటించింది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. సమంత ప్రధాన పాత్ర చేస్తుంది.