Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఫుల్ హ్యాపీ. ఆయన లేటెస్ట్ మూవీ విరూపాక్ష అంచనాలకు మించిన విజయం నమోదు చేసింది. వీకెండ్ ముగిసే నాటికే బ్రేక్ ఈవెన్ దాటేసింది. 2023 టాలీవుడ్ సూపర్ హిట్స్ లో చేరిపోయింది. కొత్త దర్శకుడు కార్తీక్ దండు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పర్ఫెక్ట్ థ్రిల్లర్ అందించారు. విరూపాక్ష విజయం పై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏడాదిన్నర గ్యాప్ తర్వాత సాయి ధరమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు.
విరూపాక్ష చిత్ర ప్రమోషన్స్ లో సాయి ధరమ్ తేజ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇష్టపడిన హీరోయిన్స్ గురించి ఓపెన్ అయ్యారు. వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సమంత గురించి ఆయన చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పరిశ్రకు వచ్చాక కొందరు హీరోయిన్ పట్ల ప్రేమాభిమానాలు, ఇష్టం పెంచుకున్నట్లు చెప్పారు. కొందరు హీరోయిన్స్ ని అయితే ఏకంగా ప్రేమించినట్లు షాకింగ్ కామెంట్స్ చేశాడు.
సమంతను ఉద్దేశిస్తూ… ఒక వ్యక్తిగా ఆమె నన్ను ఎట్రాక్ట్ చేసింది. సమంత అంటే నాకు ఇష్టం అన్నారు. ఇక కెరీర్ బిగినింగ్ లో తనతో జతకట్టిన సయామీ ఖేర్, రెజీనా కాసాండ్రా అన్నా కూడా ఇష్టమని వెల్లడించారు. తిక్క మూవీలో జంటగా నటించిన లారిస్సా బోనేసిని అయితే సాయి ధరమ్ చూడగానే ఇష్టపడ్డాడట. చెప్పాలంటే ప్రేమలో పడిపోయాడట. షూటింగ్స్ సెట్స్ లో నువ్వంటే ఇష్టం… డేటింగ్ చేద్దామా? అని నేరుగా అడిగేశాడట. సారీ తేజ్, ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని లారిస్సా చెప్పేసిందట.

ఇక కాలేజ్ డేస్ లో కూడా సాయి ధరమ్ తేజ్ కి ప్రేమలు ఉన్నాయట. ఒక అమ్మాయిని స్కూల్ డేస్ నుండి ప్రేమించాడట. మొదట్లో స్నేహితులుగా ఉండేవారు ప్రేమికులు అయ్యారట. కానీ డిగ్రీలో వేరే వ్యక్తితో ఆ అమ్మాయికి వివాహం చేసి పంపాల్సి వచ్చిందట. అప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ జీరో. డిగ్రీ తప్ప ఏం లేదు. అందుకే నా ప్రేమను త్యాగం చేశానని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు… ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో వినోదయ సీతాం రీమేక్ చేస్తున్నారు. ఇది మల్టీస్టారర్.