Samantha: హీరోయిన్ సమంత సరైన జోడీ కోసం వెతుకున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా వైరల్ అవుతుంది. సమంత ప్రస్తుతం సింగిల్. ఆమె నాగ చైతన్యతో విడిపోయి రెండేళ్లు అవుతుంది. 2021 అక్టోబర్ లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. ఆ మధ్య సమంత రెండో పెళ్ళికి సిద్ధం అవుతున్నారంటూ పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఒక దశలో సమంతకు పెళ్లి ఆలోచన లేదని, పేరెంట్స్ బలవంత పెడుతున్నా చేసుకోను అంటున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఆమె మంచి సంబంధం కోసం వెతుకుతున్నాము… అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఆమె సంబంధం వెతుకుతుంది తన కోసం కాదట. డాక్టర్ జెవెల్ గమాడియా కోసమట. డాక్టర్ గమాడియా ఫోటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన సమంత సంబంధం కోసం వెతుకుతున్నాము. ఈ అబ్బాయి పైకి కనిపించే దానికంటే తెలివైనవాడే అని కామెంట్ పెట్టింది. సమంత పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఎవరీ డాక్టర్ గమాడియా అంటే… ఈయనో సెలెబ్రిటీ వైద్యుడు. వెస్ట్రన్ అక్యుపెంచర్ వైద్యం చేస్తారు. కత్రినా కైఫ్, అజయ్ దేవ్ గణ్, అనుష్క శర్మ వంటి టాప్ సెలెబ్రిటీలకు వైద్యం చేశారట.
సమంత కూడా డాక్టర్ గమాడియా వద్ద చికిత్స చేయించుకున్నారని సమాచారం. అతనితో సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఓ ఫన్నీ పోస్ట్ పెట్టారు. ఇక సమంత విషయానికి వస్తే ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా? అనేది సస్పెన్సు. సమంత ఏజ్ 35 ఏళ్ళు దాటిపోయింది. వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే ఏజ్ బార్ అవుతుంది. మరి సమంత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
సమంత ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇది యాక్షన్ ఎంటర్టైనర్. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ గా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కొంత మేర షూటింగ్ జరుపుకుంది. సమంత ఈ సిరీస్ కోసం బాగా కష్టపడుతున్నారు. కఠిన యాక్షన్ సీక్వెన్స్ లలో పాల్గొంటున్నారు. ఇక ఖుషి మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకుడిగా ఉన్నారు.