
నటిగా ఎంతో ఎత్తుకి ఎదిగిన సమంత వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ ఇప్పటికే ఒక మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. విశేషం ఏమిటంటే పెళ్ళికి ముందు కన్నా పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలయ్యాక నటన ఫై మరింత శ్రద్ద పెడుతోంది. ఇంకా చెప్పాలంటే పెళ్ళికి ముందు నటిగా సమంత పోషించిన పాత్రలకి పెళ్లయ్యాక పోషిస్తోన్న పాత్రలకి చాలా వ్యత్యాసం కనపడుతోంది..పెళ్ళికి ముందు సమంత హిట్ సినిమాల్లో నటించింది కానీ వాటిలో నటనకు ఆస్కారమున్న గొప్ప పాత్రలు అయితే రాలేదు. పెళ్లి అయ్యాకే రంగస్థలం , మహానటి , మజిలీ , ఓ బేబీ , యూ టర్న్ వంటి చిత్రాల్లో నటించి తానేమిటో నిరూపించుకొంది. …. ఏరికోరి పాత్రలను ఎంచుకొంటూ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
కేంద్రం విద్యుత్ బిల్.. రైతుల పాలిట శాపం
అదలా ఉంటే ఇపుడు ఇంకో అడుగు ముందుకేసి నటన నేర్చు కొంటోంది . లాక్ డౌన్ నేపథ్యంలో సినీ తారలంతా ఇంటి వద్దే గడుపుతున్నారు. ఇంటి పనులు చేయడం వాటికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరించడం చేస్తున్నారు. సమంత మాత్రం వీరందరికీ డిఫరెంట్ గా తన లాక్ డౌన్ పిరియడ్ ల ఒక ఆన్ లైన్ యాక్టింగ్ క్లాసులో జాయిన్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపింది. నటన పట్ల సమంతకి ఉన్న అంకిత భావం చూసి అందరూ సమంత ని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు.