https://oktelugu.com/

Samantha: న్యూయార్క్ నగరంలో సమంత… ట్రీట్మెంట్ ఎలా సాగుతుంది!

అమెరికా వెళ్లిన సమంత అక్కడి ఫోటోలు షేర్ చేశారు. ఆమె న్యూయార్క్ నగరంలో ఉన్నారు. అందమైన ప్రదేశాలు సందర్శించారు. సన్నిహితులను కలిశారు. తన న్యూయార్క్ నగర ట్రిప్ ఫోటోలు సమంత షేర్ చేశారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 21, 2023 / 09:53 AM IST

    Samantha

    Follow us on

    Samantha: హీరోయిన్ సమంత అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. మయోసైటిస్ బారిన పడిన సమంత చికిత్స కోసం అక్కడకు వెళ్లారు. గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత తనకు అనారోగ్యం సోకినా విషయం వెల్లడించింది. ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేశారు. అయితే ఇది దీర్ఘకాలిక సమస్య అని అర్థం అవుతుంది. కొన్ని నెలలు ఆమె షూటింగ్స్ బంద్ చేసి ఇంటికే పరిమితమైంది. 2023 ప్రారంభంలో మరలా వర్క్ స్టార్ట్ చేసింది. మిగిలి ఉన్న ఖుషి చిత్ర షూటింగ్ పూర్తి చేసింది.

    అలాగే సైన్ చేసిన సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంది. జులై నెలలో సిటాడెల్ చిత్రీకరణ సైతం పూర్తయింది. ప్రస్తుతం సమంత ఖాళీగా ఉన్నారు. ఆరోగ్యం మీద పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్న సమంత అమెరికా వెళ్లారు. అక్కడ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోనున్నారని సమాచారం. అందుకోసం ఏడాది పాటు సమంత సినిమాలు చేయరని తెలుస్తుంది. ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి.

    అమెరికా వెళ్లిన సమంత అక్కడి ఫోటోలు షేర్ చేశారు. ఆమె న్యూయార్క్ నగరంలో ఉన్నారు. అందమైన ప్రదేశాలు సందర్శించారు. సన్నిహితులను కలిశారు. తన న్యూయార్క్ నగర ట్రిప్ ఫోటోలు సమంత షేర్ చేశారు. విదేశాలు వెళ్లినా సమంత జిమ్ చేయడం వదల్లేదు. వర్క్ అవుట్ లుక్ కూడా ఒకటి పోస్ట్ చేశారు. సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. అది సరే… ఇంతకీ మీ అర్యోగం ఎలా ఉంది. ట్రీట్మెంట్ ఎప్పుడని అడుగుతున్నారు. సమంత ట్రీట్మెంట్ ఒకటి రెండు రోజుల్లో మొదలుకానుందని సమాచారం.

    ఈ లోపు ఆమె మానసికంగా సిద్ధం అవుతున్నారు. ఇక ఖుషి మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. దర్శకుడు శివ నిర్వాణ ఎమోషనల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఖుషి చిత్ర సాంగ్స్ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్ కి భారీ ఆదరణ దక్కింది. మరోవైపు సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.