Samantha Myositis – Unni Mukundan: అనార్యోగంతోనే యశోద షూట్ సమంత పూర్తి చేశారని తెలుస్తోంది. తనకు మయోసైటిస్ సోకిన విషయాన్ని సమంత ఎవరికీ తెలియనీయలేదు.ప్రస్తుతం ఈ అరుదైన వ్యాధికి సమంత చికిత్స తీసుకుంటున్నారు. కాగా యశోద మూవీ సెట్స్ లో ఎలా ఉండేదో ఆమె సహనటుడు ఉన్ని ముకుందన్ తెలియజేశారు. సమంత ఒక వ్యాధితో బాధపడుతున్నారని కొంచెం కూడా అనిపించలేదు అన్నారు. సమంత సెట్స్ లో చాలా ఎనర్జిటిక్ గా ఉండేవారు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతంగా చేశారు. యశోద పాత్ర కోసం సమంత చాలా ప్రిపేర్ అయ్యారు. కఠిన యాక్షన్ సీన్స్ లో నటించారు.

ఆమె అందరితో కలిసిపోతారు. చాలా సరదాగా మాట్లాడతారు. సమంతకు మయోసైటిస్ సోకిందని తెలిసి చాలా బాధ వేసింది. అయితే సమంత చాలా స్ట్రాంగ్. ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదిరించి ఆమె తిరిగి కోలుకుంటారు, అని ఉన్ని ముకుందన్ తెలియజేశారు. ఉన్ని ముకుందన్ కి తెలుగులో ఇది నాలుగో చిత్రం. గతంలో జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడి చిత్రాల్లో ఉన్ని ముకుందన్ నటించారు. యశోద మూవీలో ఆయన కీలక రోల్ చేశారు.
ఇక యశోద మూవీ ప్రమోషన్స్ లో సమంత పాల్గొనే అవకాశం లేదు. ఇంటి వద్దే ఉంటూ సమంత చికిత్స తీసుకుంటున్నారు. తనకు మయోసైటిస్ అంటూ సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేసిన ఫోటోలో ఆమె చేతికి సిరంజీ ఉంది. ఇంట్లో నుంచే సమంత యశోద చిత్ర డబ్బింగ్ పూర్తి చేశారు. గతంలో సమంతకు సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పేవారు. యశోద చిత్రానికి సమంత స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.

సమంత ఆరోగ్య పరిస్థితిపై చిత్ర ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని విషెస్ తెలియజేశారు. సమంత హీరోయిన్ గా శాకుంతలం, ఖుషి తెరకెక్కుతున్నాయి. శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సమంత అనార్యోగం వలన వచ్చిన ఇబ్బంది లేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి షూట్ ఎఫెక్ట్ అయ్యే సూచనలు కలవు. ఇక నవంబర్ 11న యశోద విడులవుతున్న నేపథ్యంలో సమంత ప్రమోషన్స్ కి దూరంగా ఉండటం ఇబ్బందికర పరిణామం.