సమంత.. సోషల్ మీడియా నిండా ప్రస్తుతం ఈ పేరే హాట్ టాపిక్ అయింది. నాగ చైతన్య తాము విడిపోతున్నామని ప్రకటించగానే ‘అయ్యో పాపం సమంత‘ అన్నారు. కానీ, చైతు చాలా సైలెంట్, మంచి వాడు.. పైగా అతను సామ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక విధంగా చైతు కేవలం ప్రేమ కోసమే సామ్ ని పెళ్లి చేసుకున్నాడు. కానీ సామ్ ? ఇక్కడే విడాకులకు కారణం ఇదే అంటూ పుకార్లు పుట్టాయి.

కరెక్ట్ గా ఇదే సమయంలో రంగంలోకి వచ్చాడు హీరో సిద్ధార్థ్. సమంతను ఉద్దేశించి.. ఇన్ డైరెక్ట్ గా ‘మోసగాళ్లు ఎప్పుడూ ఎప్పటికీ బాగుపడరు’ అంటూ ఒక కామెంట్ పెట్టాడు. ఈ ట్వీట్ లోని అర్థం గ్రహించిన నెటిజన్లు సమంత వ్యవహారం పై చర్చ మొదలుపెట్టారు. సిద్ధూ ట్వీట్ లో సమంత ప్రస్తావన లేకపోయినా సమంత గురించే ఆ ట్వీట్ అనేది అందరికీ అర్థం అయిపోయింది.
అంటే.. సిద్ధార్థ్ ను సమంత మోసం చేసిందా ? ఇప్పుడు చైతు విషయంలో కూడా సమంత పొరపాటు ఏమైనా ఉందా ? అంటూ అభిమానులు ఆరా తీశారు. ఇక్కడ మరో వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. అతనే.. సమంత పర్సనల్ స్టైలిస్ట్ ‘ప్రీతమ్ జుకల్కర్’. గతంలో ఇతనితో సమంత చాలా సన్నిహితంగా ఉంది, ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
దీనికితోడు ‘ప్రీతమ్ జుకల్కర్’ ‘సామ్ – చై’ విడాకుల నేపథ్యంలో కొన్ని పోస్టులు చేశాడు. ఆ పోస్ట్ ల్లో ఒక పోస్ట్ ‘నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అబద్ధాలు, రహస్యాలనేవి అనుబంధాలను తుంచివేస్తాయి’. ఈ మెసేజ్ లోని భావాన్ని లోతుగా అర్థం చేసుకుంటే.. చైతు దగ్గర సమంత అబద్ధాలను, రహస్యాలను దాచడానికి జాగ్రత్త పడిందా ? అవి.. చైతుకి తెలిసి వారి మధ్య అనుబంధం తెగిపోయిందా ?
ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం పై సమంత ట్రోలింగ్ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురి అవుతుంది. నిజంగానే సమంతకు ప్రీతమ్ జుకల్కర్’తో ఎఫైర్ ఉందని.. అందుకే అతను పై విధంగా పోస్ట్ లు పెట్టాడని.. అది తెలిసే చైతు విడాకులు ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.