Samantha : సమంత స్ట్రాంగ్ ఉమన్. గోడకు కొట్టిన బంతిలాగా అంతే ఫోర్స్ తో తిరిగి రంగంలోకి దిగుతుంది. ఈ మయోసైటిస్ తననేమీ చేయలేదని నిరూపించింది. సమస్య ఏదైనా ఎదిరించి నిలబడగలనని రుజువు చేసింది. సమంత షూటింగ్స్ కి సిద్ధం అవుతున్నారు. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటిగా పూర్తి చేయనున్నారు. కొత్త చిత్రాలకు సైన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఖుషి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ఈ మేరకు ట్వీట్ చేశారు. సమంత పేరు ప్రస్తావించకున్నప్పటికీ ఖుషి చిత్ర షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభం కాబోతుందంటూ ట్వీట్ చేశారు.

సమంత అనారోగ్యం బారినపడిన నేపథ్యంలో ఖుషి చిత్ర షూటింగ్ కి తాత్కాలిక విరామం ఏర్పడింది. సమంత పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో, మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తి చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అతి త్వరలో సమంత ఖుషి సెట్స్ లో జాయిన్ కానున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. మహానటి తర్వాత సమంత-విజయ్ దేవరకొండ మరోసారి కలిసి నటిస్తున్నారు.
అలాగే ఆమె శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన శాకుంతలం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో కేవలం సమంత ఫేమ్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించాల్సి ఉంది. గుణశేఖర్ ని ఈ జనరేషన్ ఆడియన్స్ ఎప్పుడో మర్చిపోయారు. కాబట్టి సమంతనే సినిమాకు దిక్కు. గట్టిగా ప్రమోషన్స్ నిర్వహించి జనాలను ఆకర్షించాల్సిన బాధ్యత ఆమెదే. కాబట్టి సమంత నిరవధికంగా శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొనేలా మేకర్స్ ఒత్తిడి తెచ్చారు.
వీటితో పాటు సమంత సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ది ఫ్యామిలీ మాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే సిటాడెల్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఇది హాలీవుడ్ సిరీస్ రీమేక్ గా తెరకెక్కుతుంది. కాబట్టి సమంత కాలు బయటపెడితే వాడేయడానికి పలు ప్రాజెక్ట్స్ కి చెందిన మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. దీంతో సమంత క్షణం తీరికలేకుండా గడపాల్సి ఉంది. ఇక 2021లో విడాకులు ప్రకటించిన సమంత ఒంటరిగా ఉంటున్నారు. ఆమెకు రెండో వివాహం చేసుకునే ఆలోచన లేదంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె తెల్ల బట్టలు ధరిస్తూ, జపమాలతో కనిపిస్తున్నారు. మానసిక ప్రశాంత కోసం ఇలా చేస్తున్నారు.