https://oktelugu.com/

సమంత ‘శాకుంతలం’ గ్యాంగ్ కి శుభవార్త.. కానీ !

కరోనా సెకెండ్ వేవ్ అంటూ ఒకపక్క హడావుడి, దానికి తగ్గట్టుగానే మరోపక్క కరోనా కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. పైగా వరుసగా సినిమా వాళ్లకు కరోనా పాజిటివ్ కేసులు వస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు షూటింగ్ లను ఆపెసుకుని కూర్చున్నారు. ఈ క్రమంలోనే కరోనా వల్ల సమంత సినిమాకి కూడా బ్రేక్ పడింది. సమంత హీరోయిన్ గా గుణశేఖర్ తీస్తున్న ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ లో కరోనా కలకలం రేగిన మాట వాస్తవం. ఏకంగా దర్శకుడు […]

Written By:
  • admin
  • , Updated On : April 13, 2021 / 06:09 PM IST
    Follow us on

    కరోనా సెకెండ్ వేవ్ అంటూ ఒకపక్క హడావుడి, దానికి తగ్గట్టుగానే మరోపక్క కరోనా కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. పైగా వరుసగా సినిమా వాళ్లకు కరోనా పాజిటివ్ కేసులు వస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు షూటింగ్ లను ఆపెసుకుని కూర్చున్నారు. ఈ క్రమంలోనే కరోనా వల్ల సమంత సినిమాకి కూడా బ్రేక్ పడింది. సమంత హీరోయిన్ గా గుణశేఖర్ తీస్తున్న ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ లో కరోనా కలకలం రేగిన మాట వాస్తవం. ఏకంగా దర్శకుడు గుణశేఖర్ కే కరోనా పాజిటివ్ అని తేలడంతో తప్పనిసరి పరిస్థితులో షూటింగ్ ఆపేశారు.

    ఐతే, ఈ సినిమా యూనిట్ కి మళ్ళీ శుభవార్త అందింది. గుణశేఖర్ కీ రెండోసారి కరోనా పరీక్ష చేయగా, నెగెటివ్ అని వచ్చింది. దాంతో ఈ సినిమా సభ్యులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, వెంటనే షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేయకుండా.. కొద్దీ రోజల పాటు గుణశేఖర్ ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కరోనా పరీక్ష చేయించుకుని.. అప్పుడు కూడా నెగటివ్ అని వస్తే.. ఇక అప్పటి నుండి షూటింగ్ ను స్టార్ట్ చేస్తాడట. అయితే సమంత మాత్రం ఈ వారాంతం నుంచి మళ్ళీ డేట్స్ ఇచ్చింది.

    కాబట్టి, అప్పటిలోగా గుణశేఖర్ కూడా రెడీ అవుతారని టాక్. అంటే వచ్చే వారం నుండి ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలుకానుంది అన్నమాట. ఇక గుణశేఖర్ ప్రస్తుతం సమంత మెయిన్ లీడ్ గా చేస్తోన్న ఈ శాకుంతల సినిమాని పూర్తి చేసాకా.. హిరణ్య కశ్యప సినిమాని స్టార్ట్ చేస్తాడట. ‘రానా’ ప్రధాన పాత్రగా ఈ భారీ పౌరాణికం మూవీ రాబోతుంది. ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్ అధికంగా ఉండటం కారణంగానే ఈ సినిమాను దాదాపు రెండు సంవత్సరాల పాటు పోస్ట్ ఫోన్ చేసారు. అత్యంత భారీ చిత్రంగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.