Samantha Fake Medicine Promotion : సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). మన అందరికీ తెలిసిందే, ఇన్ స్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉండే పలువురు సెలబ్రిటీలు వివిధ రకాల ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారి ప్రమోట్ చేస్తుంటారు. సినిమాల ద్వారా వచ్చే డబ్బులకంటే, ఈ ప్రొమోషన్స్ ద్వారా వాళ్లకు వచ్చే డబ్బులే ఎక్కువ. సమంత కూడా ఇలాంటి ప్రొమోషన్స్ గట్టిగానే చేస్తుంది. కానీ ఆమె ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాలని అనుకున్నప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంది. తన వద్ద ఉన్న ముగ్గురు డాక్టర్స్ చేత ఆ ప్రొడక్ట్స్ ని పరిశీలించి అవి వాడొచ్చు అని వాళ్ళు అంగీకరించినప్పుడే ఆమె సదరు ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి ఒప్పుకుంటుంది. ఒకవేళ జనాలకు హాని కలిగించేలా ఉంటే మాత్రం ఆమె ఒప్పుకోదు. అలా ఒప్పుకోకుండా రిజెక్ట్ చేసిన ప్రోడక్ట్స్ ఒక్క ఏడాది లోనే 15 కి పైగా ఉన్నాయని రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
Also Read : అతనితో కలిసి నటించడమే నేను చేసిన పెద్ద తప్పు – మీనాక్షి చౌదరి
ఇన్ని జాగ్రత్తలు తీసుకునే సమంత, ఒక ప్రోడక్ట్ విషయంలో తొందరపడి పొరపాటు చేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే గత కొంత కాలంగా ఆమె NMN అనే సప్లిమెంట్ ని తెగ ప్రమోట్ చేస్తుంది. ఈ సప్లిమెంట్ మన శరీరం లోని DNA ని రిపేర్ చేసి మన వయస్సు పెరగనివ్వకుండా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ బ్రాండ్ ని ఆమె ప్రమోట్ చేయడం మాత్రమే కాదు,ఆ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా కూడా మారిపోయింది. తన ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తూ ‘ఈ సప్లిమెంట్ ని వాడిన తర్వాత వాటి ఫలితాలను మీరే చూడండి. నేను కేవలం ఈ టాబ్లెట్స్ ని తీసుకోవడమే కాకుండా గతాకా సంస్థకు కో వ్యవస్థాపకురాలిగా కూడా వ్యవహరిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
అయితే సమంత చేస్తున్న ఈ ప్రచారం పై ప్రముఖ డాక్టర్ లివర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘సైన్స్ మీద కనీస అవగాహనా లేని నటి సమంత. ఒక్క పెద్ద స్థాయిలో ఉంటూ లక్షలాది మంది అభిమానులను ప్రభావితం చేసేలా వృద్దాప్యం తగ్గించే ఔషధం అంటూ నకిలీ సప్లిమెంట్ ని ప్రమోట్ చేస్తుంది. ఈ సప్లిమెంట్ ని గతం లో ఎలుకల మీద ప్రయోగించినప్పుడు అవి అంతకు ముందు ఉన్నదానికంటే యాక్టీవ్ గా ఉన్నట్టుగా రిపోర్ట్స్ వచ్చాయి కానీ, వాటి జీవితకాలం పెరగలేదు, అంతే కాకుండా వృద్దాప్యం లో వచ్చే వ్యాధుల నుండి ఈ టాబ్లెట్స్ దూరం చేస్తుంది అనేది కూడా నిరూపితం కాలేదు’ అంటూ మండిపడ్డాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సమంత వరకు ఈ విషయం చేరిందో లేదో తెలియదు కానీ, ఒకవేళ చేరితే మాత్రం అమ్మే రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.