Samantha Ruth Prabhu: నాగ చైతన్య(Akkineni Naga chaitanya) తో సమంత(Samantha Ruth Prabhu) విడిపోయిన తర్వాత ఒంటరిగానే జీవిస్తుంది అనేది నిన్న మొన్నటి మాట. కానీ ఇప్పుడు ఆమె ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో ప్రేమాయణం నడుపుతుంది అనేది కొత్త మాట. ఇది దాదాపుగా ఖాయం చేసేసుకోవచ్చు. సమంత ఎంత దాచుకోవాలని చూస్తున్నప్పటికీ దాచుకోలేని నిజంగా మాదిరిపోయింది ఇది. ఇటీవలే రెండు మూడు చోట్ల వీళ్లిద్దరు కలిసి తిరగడం బాలీవుడ్ మీడియా మొత్తం చూసింది. రీసెంట్ గా ఆమె తన స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ పుట్టిన రోజు వేడుకలకు రాజ్ నిడిమోరు తో జంటగా కలిసి హాజరైంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. సమంత ప్రస్తుతం రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించే ఏ సినిమాలోనూ, వెబ్ సిరీస్ లోనూ నటించడం లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్లినా అతనితోనే కనిపిస్తుందంటే కచ్చితంగా వీళ్ళ మధ్య రిలేషన్ ఉన్నట్టే కదా.
నాగ చైతన్య తో విడాకులు కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ సమయంలోనే జరిగింది. అప్పట్లో అందరూ సమంత ఆ సిరీస్ లో హద్దులు దాటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం వల్లే నాగ చైతన్య తో విబేధాలు ఏర్పడ్డాయని, అందుకే విడిపోయారని వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అసలు నిజం అది కాదు. పరిస్థితులన్నీ డాట్స్ గా కనెక్ట్ చేసి చూస్తే, అప్పట్లో సమంత, రాజ్ నిడిమోరు మధ్య ఏర్పడిన స్నేహమే వీళ్లిద్దరి విడాకులకు దారి తీసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు నుండి నాగ చైతన్య, శోభిత తో రిలేషన్ మైంటైన్ చేయడం వల్ల మనస్పర్థలు వచ్చి విడిపోయారనే వాదన కూడా వినిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు నాగ చైతన్య వైపే తప్పు మొత్తాన్ని తోసేసి చూపించేలా పరిస్థితులు ఉండేవి.
కానీ ఇప్పుడు సమంత, రాజ్ నిడిమోరు మధ్య రిలేషన్ ని చూసిన తర్వాత, వీళ్ళిద్దరిలో ఎవరిదీ తప్పు, ఎవరిదీ ఒప్పు అనేది అంచనా వేయడం చాలా కష్టమైపోయింది. అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేది వాళ్ళిద్దరితో ఎవరో ఒకరు నోరు విప్పితే కానీ ఈ రూమర్స్ కి చెక్ పడదు. ఇకపోతే రాజ్ నిడిమోరు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ లో సమంత ని ఎంత క్రూరమైన విలన్ గా చూపించాడో మనమంతా చూసాము. ఈ సినిమా వల్లే సమంత కి బాలీవుడ్ కి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇప్పుడు ఆమె ‘రక్త బ్రహ్మాండ’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తుంది. నెట్ ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. గత ఏడాది ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. మరి ఈ సిరీస్ లో అయినా సమంత మెప్పిస్తుందో లేదో చూడాలి.