Homeఎంటర్టైన్మెంట్Samantha: ఫ్యామిలీ మెన్.. నా హోమ్ ను దెబ్బ కొట్టింది.. సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha: ఫ్యామిలీ మెన్.. నా హోమ్ ను దెబ్బ కొట్టింది.. సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha: ప్రపంచం మొత్తం వినోదం(entertainment) వెంట పరుగులు తీస్తోంది. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, సినిమా, వెబ్ సిరీస్, సీరియల్స్.. పేరు ఏవైనా కానీయండి. అంతిమంగా ప్రేక్షకులను కదిలించడం, ఆనందింప చేయటం.. వాటివల్లే అవుతోంది. అందుకే సమాజంలో మరీ ముఖ్యంగా మనదేశంలో వారే సెలబ్రిటీలుగా చలామణి అవుతున్నారు.. మీడియా సంస్థలు కూడా నిర్వహిస్తున్న ప్రత్యేక సదస్సుల్లో సెలబ్రిటీలను ముఖ్య అతిథులుగా పిలుస్తున్నాయి. మనదేశంలో పేరుపొందిన మీడియా సంస్థల్లో ఇండియా టుడే(India today) ఒకటి. అది ప్రతి ఏడాది కాన్ క్లేవ్(conclave) పేరుతో సదస్సులో నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా #India today conclave-24 పేరుతో సదస్సు ప్రారంభించింది. అందరికంటే ముందుగా హీరోయిన్ సమంతతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.. ఆ కార్యక్రమానికి కూడా “splendid mis Samantha from Pushpa to the family man carving her own niche” అనే ప్రత్యేకమైన పేరు పెట్టింది. ఏకంగా ఒక స్పెషల్ స్పెషల్ మొత్తం ఆమెతోనే కొనసాగించింది. అందులో సమంత ఏం మాట్లాడిందంటే..

14 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి

“నా కెరియర్లో 14 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. అన్నింటికి నేను భయపడిపోయాను. భయం వల్లే నా కెరియర్ చాలా సంవత్సరాలు గడిచిందని బయటి వాళ్లకు ఇది చాలా సుదీర్ఘమైన సమయం లాగా కనిపించవచ్చు. కానీ నాకున్న అవకాశాలు చాలా తక్కువ. వైఫల్యం పట్ల నాకున్న భయమే నన్ను ఎక్కువగా అధిగమించింది. నేను ఇక్కడ దాకా వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. భయం వల్ల నేను చాలా దూరం పరిగెత్తాను. కొంత విశ్రాంతి తీసుకోమని నాకు ఎవరూ చెప్పలేదు. పని వల్ల నాకు రోజుకు ఐదు గంటలు మాత్రమే నిద్ర దొరుకుతుంది. ఆయనప్పటికీ నేను ఒక ప్రొడక్టివ్ పర్సన్ లాగా ఎదిగాను. 14 సంవత్సరాలపాటు నా శరీరానికి, నా మెదడుకు నేను విశ్రాంతి ఇవ్వలేదు. ఒకరోజు ఉదయం లేవగానే నేను ఉండను.. నేను ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ నాకున్న వ్యాధి కారణంగా ఆస్వాదించలేకపోయాను. అయినప్పటికీ నాకు నేను సర్ది చెప్పుకున్నానని” సమంత వ్యాఖ్యానించింది.

వ్యాధితో బాధపడినప్పుడు..

“నాకున్న వ్యాధితో నేను బాధపడినప్పుడు కూడా సినిమా ప్రమోషన్లకు వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యంగా శాకుంతలం సినిమా విడుదల సమయంలో నిర్మాతలు నన్ను ఎంతో ఒత్తిడికి గురి చేశారు. దీంతో ఓపిక లేకపోయినా ప్రమోషన్లకు వెళ్లాల్సి వచ్చింది. హైడోస్ మెడికేషన్ లో ఉన్నప్పుడు నా ముఖం మొత్తం మారిపోయింది. దీనిపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొంతమంది నాకు సింపతి క్వీన్ అని పేరు పెట్టేశారు. రోజు ఉదయం లేవగానే నా గురించి ఏం రాశారో ఆన్లైన్లో వెతికే దాన్ని. అదే సమయంలో నాకు నేను సమాధానం చెప్పుకునేదాన్ని. నేను ఈరోజులో మానసికంగా ఎదగడానికి, దృఢంగా మారెందుకు వారే కారణమయ్యారు. నన్ను చూసి నేనే గర్వపడే మనిషిలాగా నన్ను తయారు చేశారు” అని సమంత పేర్కొన్నది.

నా హోం పాడయింది

పుష్ప సినిమాలో ఊ అంటావా, ఫ్యామిలీ మెన్ సినిమాలోని రాజీ పాత్ర గురించి.. ప్రస్తావన వచ్చినప్పుడు సమంత చాలా స్పష్టంగా మాట్లాడింది. “పుష్పలో ఊ అంటావా పాట ఎందుకు చేశానో, ఫ్యామిలీ మెన్ లో రాజీ పాత్ర కూడా అందుకే చేశాను.. కాకపోతే పుష్పలో ఊ అంటావా పాట నాకు కొత్త అనుభవం. ఇక రాజీ పాత్ర అయితే నా హోమ్ ను పాడు చేసింది. ఫ్యామిలీ మెన్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫ్యామిలీ మెన్ లో నా పాత్ర వల్ల ఎవరైనా బాధపడితే.. ఐ యాం సారీ”అంటూ సమంత వ్యాఖ్యలు చేసింది. ఫ్యామిలీ వెబ్ సిరీస్ లో పోషించిన రాజీ పాత్ర వల్లే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చాడని ఇప్పటికీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతూ ఉంటుంది. ఇన్ని రోజుల తర్వాత సమంత ఆ పాత్ర పోషించినందుకు సారీ చెప్పడం పట్ల పరోక్షంగా నాగచైతన్యకు క్షమాపణలు చెప్పినట్టేనా?! ఏమో కొన్ని వ్యాఖ్యలకు అర్థాలు వెతకలేం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular