https://oktelugu.com/

Samantha : అవి  నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి – సమంత  

Samantha : బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రధాన పాత్రలో ‘గంగూబాయి కతియావాడి’ మూవీ ఇటీవల రిలీజై విజయవంతంగా నడుస్తోంది. ఈ చిత్రంలో ఆలియా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత స్పందించింది. ‘గంగూబాయి కతియావాడి ఒక కళాఖండం.. ఆలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవు. ప్రతీ ఒక్క డైలాగ్ , హావాభావాలు నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అన్నట్టు అలియా భట్ కూడా రీసెంట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 27, 2022 / 06:00 PM IST

    Samantha

    Follow us on

    Samantha : బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రధాన పాత్రలో ‘గంగూబాయి కతియావాడి’ మూవీ ఇటీవల రిలీజై విజయవంతంగా నడుస్తోంది. ఈ చిత్రంలో ఆలియా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత స్పందించింది. ‘గంగూబాయి కతియావాడి ఒక కళాఖండం.. ఆలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవు. ప్రతీ ఒక్క డైలాగ్ , హావాభావాలు నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

    Samantha Serious Counter To Netizen

    అన్నట్టు అలియా భట్ కూడా రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో   సమంత గురించి క్రేజీ కామెంట్స్ చేసింది.  టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఎవరు ఇష్టమని ఓ యాంకర్ ప్రశ్నించగా, కొద్దిసేపు ఆలోచించిన అలియా సమంత పేరు చెప్పుకొచ్చింది.  సామ్ ఒప్పుకుంటే ఆమెతో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమని, ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ నటనకు తాను ఫిదా అయ్యానని,  అవకాశం వస్తే ఆమెతో కలిసి థ్రిల్లర్  సినిమా చేయాలనుకుంటున్నా అని ఆలియా చెప్పుకొచ్చింది.

    Samantha

    మొత్తానికి తెలుగు స్టార్ట్స్ పై క్రేజీ కామెంట్స్ చేస్తోంది. తెలుగు నటీనటులతో కలిసి నటించాలని ఉంది అంటూ కబుర్లు చెబుతుంది. ఈ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు.  ఈ ముద్దుగుమ్మ  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పనిచేయడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు కూడా చెప్పింది. 

    Samantha

    ‘నన్ను ఇంట్లో ఆలూ అని పిలుస్తారు. పుష్ప సినిమా చూసిన నా కుటుంబ సభ్యులు, ఆలూ.. అల్లుతో ఎప్పుడు సినిమా చేస్తున్నావ్?’ అని ఆటపట్టిస్తున్నారని వెల్లడించింది. మొత్తానికి ఆలియా, మొహమాటం లేకుండా బన్నీతో సినిమా చేయాలని ఉందని ఓపెన్ అయ్యింది.  ఆల్ రెడీ ఈ బ్యూటీ ఎన్టీఆర్‌తో మరో సినిమాలో నటించనుంది.