
అక్కినేని సమంతకి కొత్త బిజినెస్ చేసేంత టైం ఉందా ? ఇప్పటికే సమంత ఏకమ్ అనే ప్లే స్కూల్ తో పాటు సాకీ అనే దుస్తుల వ్యాపారాన్ని మొదలుపెట్టి ఆ పనుల్లో ఫుల్ బిజీగా లైఫ్ ను లీడ్ చేస్తోంది. అయితే సామ్ మళ్ళీ మరో వ్యాపారం ప్లాన్ చేస్తోంది. అదే జ్యువెలరి బిజినెస్. ఈ వ్యాపారాన్ని త్వరలోనే స్టార్ట్ చేయబోతుందని, ఇందుకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందని టాక్.
హీరోయిన్స్‌లో ఇప్పటికే తమన్నా జ్యువెలరి బిజినెస్‌లోకి అడుగుపెట్టి.. బాగానే లాభాలను గడిస్తోంది. తమన్నా దగ్గరే ఈ బిజినెస్ గురించి తెలుసుకున్న సామ్, మొత్తానికి తమన్నా సహకారంతో సామ్ ఈ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే సమంత చేసే ప్రతి బిజినెస్ లోనూ పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుంది. ఏదో పెట్టుబడి పెట్టి వదిలేయకుండా, తానే అన్ని విషయాలను చూసుకుంటూ.. తన మనసుకు నచ్చిన వాటినే సేల్ చేస్తోంది.
వాస్తవానికి సామ్ అసలు నటి అవుదామనుకోలేదు, పరిస్థితుల ప్రభావం, అవసరాల వల్ల సమంత మోడల్ గా మారింది. మోడల్ గా అవకాశం చూసే క్రమంలో ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో ఇబ్బందులకు తల వచ్చింది. అన్నిటినీ తట్టుకుని హీరోయిన్ గా ఎదిగి.. అక్కినేని ఇంటికి కోడలు అయింది. అయితే సామ్ అనుకోకుండా యాక్టింగ్ వైపుకు వచ్చినా ,
ఇండస్ట్రీలో సామ్ కు ఎవ్వరూ గాడ్ ఫాదర్స్ లేకపోయినా కష్టపడి భాష నేర్చుకుని, నటన పై ఇష్టం పెంచుకుని నేడు తానే మెయిన్ లీడ్ గా సినిమాలు చేస్తూ..ప్రస్తుతం సోలో హిట్స్ కూడా అందుకుంటుంది. ఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చాలా జాబ్స్ చేసింది కాబట్టే, సామ్ కి ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి ఫుల్ క్లారిటీ ఉందట.