
Samantha Ruthprabhu : సమంత స్పీడ్ మాములుగా లేదు. మయోసైటిస్ నుండి కోలుకున్న వెంటనే షూటింగ్లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో జరిపారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ లోని నైనిటాల్ కి వెళ్లారు. నార్త్ ఇండియా షెడ్యూల్ ముగిసిన అనంతరం విదేశాల్లో చిత్రీకరణ జరగనుంది. సౌత్ ఆఫ్రికాతో పాటు రెండు మూడు దేశాల్లో సిటాడెల్ షూట్ ప్లాన్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్ తో సిటాడెల్ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ ఫ్రాంచైజ్ కి చెందిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు.
సక్సెస్ఫుల్ డైరక్టర్స్ డుయో రాజ్ అండ్ డీకే సిటాడెల్ తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరూ వరుసగా ది ఫ్యామిలీ మాన్ 1 అండ్ 2, ఫార్జీ సిరీస్లు తెరకెక్కించారు. ఈ మూడు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ది ఫ్యామిలీ మాన్ 2లో సమంత ప్రధాన పాత్ర చేశారు. సిటాడెల్ కోసం సమంత, రాజ్ అండ్ డీకే మరోసారి జతకట్టారు. ఈ దర్శక ద్వయంతో సమంతకు మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో సుమంత వారితో దిగిన ఆసక్తికర ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.
ఓ ఫ్లైట్ జర్నీలో రాజ్ అండ్ డీకే మధ్య కూర్చొని సమంత ప్రయాణం చేస్తున్నారు. సమంత ఈ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సిటాడెల్ టీమ్ అందరూ కలిసి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారన్నది మాత్రం తెలియదు. ఈ యాక్షన్ సిరీస్ నందు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం కీలక రోల్ చేస్తున్నారు. మరోవైపు సమంత ఖుషి చిత్ర షూట్లో జాయిన్ కావాల్సి ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.
రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఖుషి 80 శాతం చిత్రీకరణ జరుపుకుందని సమాచారం. మిగిలిన చిత్రీకరణ కూడా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయాలన్నది మేకర్స్ ప్లాన్. కాగా సమంత నటించిన పౌరాణిక చిత్రం శాకుంతల విడుదల సమస్యలు ఎదుర్కొంటుంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించగా ఈ చిత్రాన్ని కొనేందుకు బయ్యర్లు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇప్పటికే రెండుసార్లు సినిమా వాయిదా వేశారు. గుణశేఖర్, దిల్ రాజు కలిసి నిర్మించారు. మలయాళ నటుడు మోహన్ దేవ్ సమంతకు జంటగా నటించారు. మోహన్ బాబు కీలక రోల్ చేశారు.