https://oktelugu.com/

Varun-Lavanya’s wedding : వరుణ్-లావణ్యల పెళ్ళిలో కలవబోతున్న సమంత, నాగ చైతన్య?

ఒకవేళ నిజంగా ఇద్దరూ హాజరైనా మాటలు ఉండకపోవచ్చు. నాగ చైతన్య సంగతి తెలియదు కానీ... సమంత పీకల్లోతు కోపంతో ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 31, 2023 / 07:04 PM IST
    Follow us on

    Varun-Lavanya’s wedding : టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు సమంత-నాగ చైతన్య. వారికి ఎవరి దిష్టి తగిలిందో కానీ మనస్పర్థలు తలెత్తాయి. విడాకులు తీసుకొని విడిపోయారు. 2021 అక్టోబర్ లో సమంత, నాగ చైతన్య అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. ఈ పరిణామం అటు నాగ చైతన్యు, ఇటు సమంత ఫ్యాన్స్ ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పెద్దవాళ్ళు కలపాలని ఎంత ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారట. ఏది ఏమైనా సమంత, నాగ చైతన్య విడిపోయారు. ఇందుకు కారణాలు ఏమిటో తెలియదు. కొన్ని పుకార్లు మాత్రం తెరపైకి వచ్చాయి.

    విడిపోయాక సమంత, నాగ చైతన్య కలిసింది లేదు. పర్సనల్ గా విడిపోయినా ప్రొఫెషనల్ గా కలిసి సినిమాలు చేస్తారనే మాట వినిపించింది. సినిమా చేయటం అటుంచితే అసలు ఒకే వేదిక, కార్యక్రమానికి హాజరైన దాఖలాలు లేవు. అయితే మొదటిసారి వారు ఓ పెళ్ళిలో కలిసే అవకాశం కలదంటున్నారు. ఇటలీలో వరుణ్-లావణ్య త్రిపాఠిల వివాహం జరుగుతుంది. ఆల్రెడీ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.

    నవంబర్ 1న వివాహం. మెగా కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటున్న ఈ పెళ్ళికి అతికొద్ది మంది చిత్ర ప్రముఖులకు ఆహ్వానం ఉందట. ఆ లిస్ట్ లో నాగ చైతన్య, సమంత కూడా ఉన్నారట. ఈ క్రమంలో సమంత-నాగ చైతన్య వరుణ్ తేజ్ పెళ్లికి హాజరు కానున్నారట. అక్కడ వాళ్ళు కలిసే అవకాశం కలదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. అదే జరిగితే విడాకుల తర్వాత సమంత-నాగ చైతన్య అటెండ్ అయిన పెళ్లిగా ఇది నిలుస్తుంది.

    ఒకవేళ నిజంగా ఇద్దరూ హాజరైనా మాటలు ఉండకపోవచ్చు. నాగ చైతన్య సంగతి తెలియదు కానీ… సమంత పీకల్లోతు కోపంతో ఉంది. రెండు మూడు సందర్భాల్లో సమంత నాగ చైతన్య మీద కోపాన్ని వ్యక్తీకరించింది. కాగా ఇటీవల సమంత పెట్ డాగ్ హ్యాష్ నాగ చైతన్య వద్ద కనిపించింది. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు హ్యాష్ ని తెచ్చారు. విడిపోయాక సమంత వద్ద ఉంటుంది. సడన్ గా నాగ చైతన్య దగ్గర ఆ పెట్ డాగ్ కనిపించడం కొత్త చర్చకు దారి తీసింది.