
దీనికి బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్, నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు శేఖర్ కమ్ముల, అఖిల్, నాగార్జున ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. కానీ ఒక్కరూ మాత్రం మిస్ అయ్యారు. ఆవిడే ‘సమంత’. నాగచైతన్య భార్య అయిన సమంత ఈ వేడుకలో కనిపించకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించింది.
సమంత సూపర్ యాక్టివ్. ఇలాంటి వేడుకల్లో ఇంకాస్త ఎక్కువ సందడి చేస్తుంది. పైగా భర్త చైతన్య సినిమా హిట్ అయ్యింది. అయితే ఈ డిన్నర్ పార్టీలో సమంత లేకపోవడం చూసి అందరూ అవాక్కయ్యారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. చిత్రబృందం మొత్తం సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు గౌరవ అతిథిగా వచ్చిన అమీర్ ఖాన్ కు నాగార్జున ఫ్యామిలీ స్పెషల్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి నాగార్జున ఫ్యామిలీ, లవ్ స్టోరీ టీం హాజరై సరదాగా గడిపారు. అయితే ఈ ఫొటోల్లో నాగచైతన్య భార్య సమంత కనిపించకపోవడం చూసి అంతా షాక్ అయ్యారు. దీంతో వీరి మధ్యన విభేదాలు నిజమేనన్న ప్రచారానికి ఇది బలం చేకూరింది.
