https://oktelugu.com/

Salman Khan’s father : చంపుతామని ఒకడు.. డబ్బులు ఇవ్వాలని ఇంకొకడు.. ఇలాంటి బెదిరింపుల మధ్య సల్మాన్ ఖాన్ తండ్రి ఆకస్మిక నిర్ణయం..

చంపుతామని ఒకడు.. డబ్బులు ఇవ్వాలని మరొకడు.. బయట తిరగనిచ్చేది లేదని ఇంకొకడు.. మొత్తానికి సల్మాన్ ఖాన్ భయం భయంగా బతుకుతున్నాడు. సెక్యూరిటీని పెంచుకున్నాడు. సీసీ కెమెరాలను భారీగా ఏర్పాటు చేసుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 31, 2024 10:19 am
    Salman Khan's father

    Salman Khan's father

    Follow us on

    Salman Khan’s father : ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య సల్మాన్ ఖాన్ బయటికి అడుగుపెడితే చాలు.. అంగరక్షకులు ఆయనను చుట్టుముడుతున్నారు. అతనిపై ఈగ వాలినా కూడా సహించలేకపోతున్నారు. కట్టుదిట్టమైన భద్రత.. అత్యంత పటిష్టమైన అంగరక్షకులు ఆయన చుట్టూ ఉంటున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన నాటి నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు విపరీతమైపోయాయి. చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్ ను బెదిరించడం మొదలుపెట్టారు. అయితే వీటిని సల్మాన్ ఖాన్ కుటుంబం పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆయన తండ్రి సలీం ఖాన్ స్పందించారు. తన కొడుకు ఇంట్లో బొద్దింకకు కూడా హాని తలపెట్టడని పేర్కొన్నారు. అది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది..

    గెలాక్సీ అపార్ట్మెంట్ లో పూజలు..

    సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వస్తున్నప్పటికీ.. ఆయన తండ్రి సలీం ఖాన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఆయన మెర్సి డేజ్ బెంజ్ కంపెనీ చెందిన ఒక కారును కొనుగోలు చేశారు. దాని విలువ 1.57 కోట్లు. ఆ కారుకు పూజ కార్యక్రమాలు కూడా చేశారు. వీటిని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద నిర్వహించారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టు దిట్టం చేసింది. పోలీసులను మోహరింపజేయడంతో.. వారు అనుమానితులను పట్టుకొని, ప్రశ్నించి వదిలేస్తున్నారు. ఇక ఇటీవల సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు పెరిగిపోయాయి. తనకు ఐదు కోట్లు ఇస్తేనే లారెన్స్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలికేలా చేస్తానని.. ఓ వ్యక్తి ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నెంబర్ కి సందేశం పంపాడు. అక్టోబర్ 17న ఈ సంఘటన జరిగింది. అయితే దీనిపై పోలీసులు విచారణ నిర్వహించారు. ఆ పని చేసింది జంషెడ్పూర్ ప్రాంతానికి చెందిన షేక్ హుస్సేన్ అని తేలింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇలాంటి బెదిరింపు కలిసి పెరిగిపోయాయి. నోయిడాకు చెందిన మహమ్మద్ తయ్యబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక బుధవారం సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. కోట్లు ఇవ్వాలని అవతలి వ్యక్తి తన మెసేజ్ ద్వారా బెదిరించాడు. అయితే అది ముంబై ట్రాఫిక్ పోలీసులకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ సందేశం పంపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. దీంతో పోలీసులు అతనికి పట్టిష్టమైన భద్రతను కల్పిస్తున్నారు.