Salman Khan Meets Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ ‘షారుక్ ఖాన్’ తనయుడి డ్రగ్స్ వ్యవహారం తెలిసిందే. అయితే ఆర్యన్ కి బాలీవుడ్ స్టార్స్ సపోర్టుగా నిలుస్తూ పబ్లిక్ గానే మెసేజ్ లు పెట్టారు. ఇక కొంతమంది అయితే, డైరెక్ట్ గానే షారుఖ్ ను కలిసి మరీ ఆర్యన్ ఖాన్ కి తమ సానుభూతి మద్దతు ఉంటుందని సగర్వంగా చాటి చెప్పారు. మొత్తం ఈ వ్యవహారంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ గా షారుక్ ఇంటికి వెళ్లి మరీ, ఆర్యన్ కేసు పై మాట్లాడి రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఎప్పటి నుంచో సల్మాన్ – షారుఖ్ మధ్య పోటీ ఉంది. ఒకరి పై ఒకరు పోటీగా సినిమాలు రిలీజ్ చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. దీనికితోడు గత కొంతకాలంగా షారుఖ్ – సల్మాన్ మధ్య సన్నిహిత సంబంధాలు లేవు. అందుకే సల్మాన్, షారుఖ్ ఇంటికి వెళ్ళగానే ఆ వార్త బాగా వైరల్ అయింది. ఇప్పుడు సల్మాన్ తన ఇంటికి రావడం పై షారుఖ్ స్పందిస్తే ఈ వార్త వైరల్ అవుతుంది.
తన ఫ్యామిలీ సమస్యల్లో ఉంటే సల్లు భాయ్ సపోర్టు చేస్తాడు అంటూ షారుక్ చెప్పిన ఓ వీడియో ప్రస్తుతం తెగ హల్ చల్ చేస్తోంది. పైగా ఆ వీడియో సల్మాన్ హోస్ట్ చేసిన ‘దస్ కా దమ్’ షో గ్రాండ్ ఫినాలే ది కావడం విశేషం. ఈ షోలో హోస్ట్ అయిన సల్మాన్, షారుఖ్ తో మాట్లాడుతూ..‘మీరు కష్టాల్లో ఉంటే.. మీకు ఎవరు తోడుగా ఉంటారు ? అని అడిగాడు.
ఆ ప్రశ్నకు షారుఖ్ మాట్లాడుతూ ‘నువ్వే సల్మాన్, నాకు ఏ ప్రాబ్లెమ్ వచ్చినా నువు నాతో ఉంటావు’ అని నవ్వుతూ చెప్పాడు. నిజమే అంటూ సల్లుభాయ్ కూడా తలూపూతూ కనిపించాడు. ఇక ఈ షో అయిపోయాక సల్మాన్ – షారుఖ్ ఎమోషనల్ అయి గట్టిగా హగ్ చేసుకోవడం కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. స్నేహానికి ప్రతిరూపంలా నిలిచారు ఈ ఇద్దరి స్టార్లు.
ఏది ఏమైనా బాలీవుడ్ సూపర్ స్టార్ ‘షారుక్ ఖాన్’ కొడుకుగా ‘ఆర్యన్ ఖాన్’కి ఫుల్ క్రేజ్ ఉంది. కానీ ఆర్యన్ ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా బుక్ అవ్వడం అతని పై నెగిటివ్ ఇమేజ్ పడేలా చేసింది.
View this post on Instagram