https://oktelugu.com/

Salaar Story : సినిమాలో సలార్ ఎంట్రీ అప్పుడుంటుందా..? ఏం స్టోరీ రా నాయనా వింటుంటేనే రక్తం ఉడికిపోతుంది…

ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే డిసెంబర్ 22వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే...

Written By:
  • NARESH
  • , Updated On : December 14, 2023 / 09:53 PM IST
    Follow us on

    Salaar Story : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరిలో ప్రభాస్ ఒకరు. ఈయన సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఛత్రపతి సినిమాతో ఒక హిస్టరీ ని సృష్టించాడు. ఈ సినిమా సమయంలో ఆయన చేసిన ఫీట్లు ప్రేక్షకుల్ని చాలా అబ్బుర పరిచాయి.

    ముఖ్యంగా ఇంటర్ వెల్ సీన్ లో ఆయన డైలాగ్ డెలివరీ గాని, ఆయన చేసిన ఫైట్స్ గానీ ప్రభాస్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా నిలబెట్టేలా చేశాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అనేది రోజుకొకటి వచ్చి నెట్ లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు సలార్ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది అది ఏంటి అంటే సలార్ ఎంట్రీ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఉండబోతున్నట్టు గా తెలుస్తుంది.దేవా ని రౌడీలు చంపే పొజిషన్ లో ఉన్నప్పుడు సలార్ ఎంట్రీ ఉండబోతున్నట్టుగా సినిమా యూనిట్ దగ్గర నుంచి ఒక లీకేజ్ అనేది బయటకు వచ్చింది.

    ఇక అప్పటినుంచి సెకండ్ పార్ట్ కి లీడ్ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిజంగా ఏ సినిమాకి లేనంత హైప్ ఈ సినిమాకి క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక దాన్ని పట్టి చూస్తుంటే సలార్ సినిమా మరో లెవెల్ లో ఉండబోతున్నట్టుగా అర్థమవుతుంది.ఇక స్క్రీన్ పైన ఒక ప్రభాస్ ని చూస్తేనే అతని అభిమానులు ఆగలేరు. ఇక ఒకేసారి ఇద్దరు ప్రభాస్ లను ఒకే స్క్రీన్ పైన చూస్తే స్క్రీన్ మొత్తం షేక్ అవాల్సిందే కలక్షన్లు మోత మోగిపోవాల్సిందే అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ చేస్తున్నారు.

    ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే డిసెంబర్ 22వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే… అయిన కూడా ప్రభాస్ మాత్రం ఈ సినిమాతో సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఒక సరైన హిట్ కూడా పడలేదు ఇక దాంతో ఈ సినిమా కనుక యావరేజ్ హిట్ అయిన కూడా భారీ కలక్షన్లను రాబట్టే అవకాశం అయితే ఉంది…ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో తెలియాలంటే 23 వా తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు…