Salaar Re Release Collections: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) తన కెరీర్ లో అత్యంత కీలకమైన సమయంలో ‘సలార్'(Salaar Movie) చిత్రం ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన కల్కి లాంటి సినిమాని తీసి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టాడు. కేవలం థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీ ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, మరోసారి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ రీ రిలీజ్ చిత్రాలలో విడుదలకు ముందే హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చింది ఈ చిత్రం. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మొదటి రోజు పూర్తి అయ్యేసరికి మూడు కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఓవరాల్ గా బుక్ మై షో లో ఈ చిత్రానికి మొదటి రోజుకు గాను లక్ష 25 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇది ప్రభాస్ కెరీర్ లో ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు. కానీ ఓవరాల్ రీ రిలీజ్ చిత్రాలతో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Superstar Mahesh Babu) సినిమాల రీ రిలీజ్ రికార్డులు అందనంత ఎత్తులో ఉన్నాయి. గబ్బర్ సింగ్ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 9 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా ఖుషి చిత్రానికి మొదటి నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ఫుల్ రన్ లో 7 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక జల్సా చిత్రానికి అయితే స్పెషల్ షోస్ పడ్డాయి. స్పెషల్ షోస్ ద్వారా ఈ చిత్రానికి 3 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన మురారి, బిజినెస్ మ్యాన్ చిత్రాలు రీ రిలీజ్ లో 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఫుల్ రన్ లో మురారి చిత్రానికి దాదాపుగా పది కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. అదే విధంగా బిజినెస్ మ్యాన్ కి 5 కోట్ల 80 లక్షల రూపాయిల వరకు వచ్చింది. ‘సలార్’ చిత్రానికి పైన ప్రస్తావించిన ఏ సినిమాకు కూడా సరితూగని గ్రాస్ వచ్చింది. కానీ ఎలాంటి అకేషన్ లేకుండా, మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టడం కూడా చిన్న విషయమేమి కాదు. ఇక ప్రభాస్ పుట్టినరోజు కి సరైన సినిమాని రీ రిలీజ్ చేస్తే కచ్చితంగా ఆల్ టైం రికార్డు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.