https://oktelugu.com/

Salaar : సలార్ లో యశ్ ఉన్నాడా..? సలార్ కి కేజీఎఫ్ కి మధ్య సంబంధం ఏంటి..?

ఈ సినిమాలో ప్రభాస్ పృధ్విరాజ్ సుకుమారన్ తో పాటు యశ్ కూడా ఉన్నాడని ఒక మాట చెప్పింది. దాంతో సలార్ లో యశ్ ఉన్నాడంటూ పెద్ద ఎత్తున ప్రసారమైతే సాగింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 13, 2023 / 10:28 PM IST
    Follow us on

    Salaar: Part 1 – Ceasefire First single song : ప్రభాస్ కెరియర్ లో అత్యంత భారీ అంచనాలతో వస్తున్న సలార్ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ తనదైన రీతిలో నటించబోతున్నాడనేది ట్రైలర్ చూస్తే మనకు అర్థం అవుతుంది.

    ఇక నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు పృధ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. దాంతో ఈ సినిమా మీద సామాన్య జనాలతో సినిమా ఇండస్ట్రీ లో ఉన్న సెలబ్రిటీస్ కి కూడా మంచి అంచనాలు అయితే ఉన్నాయి.ఇక ఈ సినిమా నుంచి రోజుకొక న్యూస్ బయటికి వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సింగర్ అయిన తీర్థ సుభాష్ ఒక ఇంటర్వ్యు లో మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రభాస్ పృధ్విరాజ్ సుకుమారన్ తో పాటు యశ్ కూడా ఉన్నాడని ఒక మాట చెప్పింది. దాంతో సలార్ లో యశ్ ఉన్నాడంటూ పెద్ద ఎత్తున ప్రసారమైతే సాగింది.

    ఇక దాంతో ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కేజిఎఫ్ సినిమాను నేను చాలాసార్లు చూశాను. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం అలాగే ఆ ఇంటర్వ్యూ లో ప్రభాస్ గురించి పృథ్వి రాజ్ సుకుమారన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కేజీఎఫ్ టాపిక్ వచ్చిందేమో అని యశ్ గురించి చెప్పాను అంతే యశ్ కి సలార్ కి సంబంధం లేదు అంటూ తను ఒక వివరణ ఇచ్చుకుంటూ వచ్చింది. ఇక దాంతో అప్పటిదాకా వచ్చిన రకరకాల వార్తలకి తెరపడింది.అయిన అటు ప్రశాంత్ నీల్ యశ్ కి సలార్ కి సంబంధం లేదు అంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ కేజిఎఫ్ కి సలార్ కి ఏదో సంబంధం ఉంది అన్నట్టుగా ఒకానొక సిచువేషన్ లో ప్రతి మ్యాటర్ ని దానికి లింక్ చేసుకుంటూ రాసుకుంటూ వస్తున్నారు…

    అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఆ రెండు సినిమాలకు సంబంధం లేదంటూనే ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇస్తూ వస్తున్నాడు దీంతో సలార్ సినిమాలో యశ్ లేడు అనేది అందరికీ క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా భారీ సక్సెస్ కొట్టబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సినిమా ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి…