Salaar Sriya Reddy : పాన్ ఇండియా రేంజ్ లో సలార్ సినిమా సక్సెస్ సాధించి కలక్షన్ల సునామిని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద ప్రతి పేక్షకుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ ఒక బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతా లో వేసుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత మంచి పేరు సంపాదించుకున్న నటి శ్రేయ రెడ్డి.ఈమె ఈ సినిమాలో జగపతి బాబు కూతురు అయిన రాధా రామ క్యారెక్టర్ లో నటించింది. ఈమె ఈ పాత్రలో చాలా ఒదిగిపోయి నటించింది. ఇప్పుడు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాహుబలిలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర ఎంతగా అయితే ఎలివేట్ అయిందో దానికి తగ్గట్టుగానే ఈ పాత్ర కూడా చాలా బాగా ఎలివేట్ అయింది అంటూ ఆ పాత్ర మీద ప్రేక్షకులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు…
ఇక ఇంత చక్కటి పాత్రని పొందిన శ్రేయ రెడ్డి ఎవరో ఒకసారి ఆమె గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…. శ్రేయ రెడ్డి వాళ్ళది తెలుగు ఫ్యామిలీ అయినప్పటికీ వాళ్ళు చెన్నై లో సెటిల్ అయ్యారు. ఇక వీళ్ళ నాన్న భరత్ రెడ్డి క్రికెటర్ గా కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఇలాంటి క్రమంలో ఈమెకు మోడలింగ్ అంటే మొదట ఇంట్రెస్ట్ ఉండడంతో వాళ్ల నాన్న అయిన భరత్ రెడ్డి కి చెబితే చదువు మొత్తం పూర్తయిన తర్వాత ఆలోచిద్దామని చెప్పాడు. దాంతో ఆమె చదువు కంప్లీట్ చేసుకుని మొదటగా సదరన్ స్పైస్ లో రేడియో జాకీగా పని చేసింది.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో పాత్రలు పోషించినప్పటికీ ఆమె విక్రమ్ తో నటించిన సమురాయ్ సినిమాలో మొదటగా మంచి క్యారెక్టర్ దొరికింది. ఇక ఆ తర్వాత అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది లాంటి సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత విక్రమ్ రెడ్డి ప్రొడ్యూసర్ గా వచ్చిన పొగరు సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని పోషించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన విక్రమ్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. విక్రమ్ రెడ్డి హీరో విశాల్ కి సొంత అన్నయ్య ఇక ఆ తర్వాత తను ఒక 10 సంవత్సరాలపాటు సినిమా ఇండస్ట్రీ ని వదిలేసి అమెరికాకు వెళ్లి సెటిల్ అయింది.
ఆ తర్వాత వడివేలు డైరెక్షన్ లో వచ్చిన ఒక సిరీస్ లో నటించింది ఆ సీరీస్ లో ఆమె పాత్రను చూసిన ప్రశాంత్ నీల్ రాధ రమ పాత్రకి ఆమె ను సెలెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ పాత్రను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆమెను బాహుబలి లో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రతో పోలుస్తున్నారు. నిజానికి ఆమె ఆ పాత్రలో చాలా ఒదిగిపోయి తనదైన పర్ఫామెన్స్ ఇచ్చిందనే చెప్పాలి…