Salaar 2 Update: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈ మూవీ చివర్లో సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రభాస్ తో సలార్ 2 సినిమా ను తెరకెక్కిస్తానని చెబుతున్నాడు. సలార్ 2 స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయినట్టుగా కూడా ఆయన గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాతో ప్రభాస్ ను టాప్ లెవల్లో చూపిస్తానని కూడా చెబుతుండడం విశేషం… ఇక కేజిఎఫ్ 3 సినిమా ఎప్పుడు వస్తుందనే విషయం తనకి కూడా తెలియదని చెప్పాడు. ఎందుకంటే దాని మీద ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదట. ప్రస్తుతానికి ఆయన ‘సలార్ 2’ సినిమాను చేసిన తర్వాత దాని గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ సక్సెస్ గా నిలపాలని చూస్తున్నాడు.
ఇక సిజిఐ వాడకుండా హీరో బాడీని చూపించాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ బాడీ ఫిట్ అయ్యేవరకు లేట్ చేశాం అంటూ కరణ చెప్పారు. నిజానికి తన బాడీని ఆ లెవల్లో మార్చడానికి ఎన్టీఆర్ తీవ్రమైన ఇబ్బందులు పడ్డాడని ఫైనల్ గా తను అనుకున్న లుక్ తీసుకురాగలిగానని చెప్పాడు.
ఈ మూవీ లో కొత్త ఎన్టీఆర్ ని చూడబోతున్నారు అంటూ ఆయన కామెంట్లు చేస్తుండటం విశేషం… డ్రాగన్ మూవీ దేశం కోసం ఉంటుందట. ఇందులో దేశభక్తి కూడా ఉంటుందని ప్రశాంత్ నీల్ చెబుతుండటం విశేషం…హీరో ఈ మూవీలో ఎవరిని ఎదిరిస్తాడు. ఎంత మంది పోటీ యుద్ధం చేయాల్సి వస్తుంది. అందులో హీరో క్యారెక్టర్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు.
ఇంతకుముందు ఆయన చేసిన ‘వార్ 2’ సినిమా విజయాన్ని సాధించకపోవడంతో ఆయన తీవ్రంగా నిరాశచెందాడు. కాబట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి భారీగా సక్సెస్ ని కట్టబెట్టి తన ఇమేజ్ ను రెట్టింపు చేయాలని చూస్తున్నాడు…ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ సైతం ప్రేక్షకుడిని విశేషంగా అలరించింది..
