https://oktelugu.com/

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మతో డేటింగ్, పెళ్లికి కూడా సిద్దమైన సాయి పల్లవి ఫ్రెండ్!

ఇష్టం లేని వర్మ దూరం పెట్టాడట. ఫోన్లు చేసి విసిగిస్తుంటే నంబర్ బ్లాక్ చేశాడట. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2023 / 07:19 PM IST

    Ram gopal Varma

    Follow us on

    Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దేశం మెచ్చిన దర్శకుడు. శివ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అనొచ్చు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లిన వర్మ అక్కడ అద్భుతాలు చేశాడు. ఆయన తెరకెక్కిచిన సత్య, రంగీలా, సర్కార్ బాక్సాఫీస్ బద్దలు కొట్టాయి. కలెక్షన్స్ కి మించి న్యూ స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అనేది పరిచయం చేశాడు. ఇదంతా గత చరిత్ర. రక్త చరిత్ర, రక్త చరిత్ర 2 వరకు వర్మ జయాపజయాలతో సంబంధం లేకుండా క్వాలిటీ ఫిలిమ్స్ తీశారు.

    ప్రస్తుతం ఆయన కాంట్రవర్సీ, అడల్ట్ కంటెంట్ ని నమ్ముకుని చిత్రాలు చేస్తున్నారు. వర్మ దగ్గర ఎప్పుడూ కొందరు హీరోయిన్స్ ఉంటారు. వాళ్లతో పార్టీలు ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాడు. వాళ్లతో వర్మకు శారీరక సంబంధం ఉందా లేదా? అనేది సమాధానం లేని ప్రశ్న. ప్రస్తుతం వర్మ కాంపౌండ్ లో అప్సర రాణి, నయన గంగూలీ ఉన్నారు. అషురెడ్డి, అరియనా, ఇనాయ సుల్తానా కూడా సన్నిహితంగా ఉంటారు.

    కాగా గాయత్రీ గుప్తా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ 2లో నటించింది. ఆ పరిచయంతో వర్మతో డేటింగ్ చేసిందట. కొన్నాళ్ళు వీరు సన్నిహితంగా ఉన్నారట. వర్మను గాయత్రీ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుందట. అది ఇష్టం లేని వర్మ దూరం పెట్టాడట. ఫోన్లు చేసి విసిగిస్తుంటే నంబర్ బ్లాక్ చేశాడట. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

    గాయత్రీ గుప్తా ఫిదా మూవీలో హీరోయిన్ సాయి పల్లవి ఫ్రెండ్ రోల్ చేసింది. గాయత్రీ హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చింది. ఈ క్రమంలో న్యూస్ రీడర్ గా కూడా చేసింది. కెరీర్ బిగినింగ్ లో స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. అవి విడుదల కూడా కాలేదు. గాయత్రీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని అంటారు. అయితే అది మన ఛాయిస్. పడుకుంటే ఆఫర్స్ వస్తాయి. హీరోయిన్ అయిపోతామని గ్యారంటీ లేదు. కొందరు వాడుకుని కూడా ఛాన్సులు ఇవ్వరని ఆమె అన్నారు.