Sai Pallavi Amarnath Yatra: ‘శివయ్య అంటే ఎంతో ఇష్టం.. ఆయనను నిత్యం పూజిస్తాను. ఆయన నామస్మరణతో అనుకున్నది సాధించా’ అని సాయిపల్లవి తన ఇన్ స్ట్రాగ్రామం ఖాతలో ఎమోషనల్ పోస్టు చేశారు. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి అమర్ నాథ్ యాత్ర చేశారు. ఈ సందర్భంగా యాత్ర పూర్తయిన తరువాత తన టూర్ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 60 ఏళ్ల వయసున్న తన తల్లిదండ్రులతో కలిసి యాత్ర చేయడం ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. అయితే యాత్రలో ఓసారి జరిగిన సంఘటనను ఆమె వివరించింది.
అమర్ నాథ్ యాత్ర చేయడం మాములు విషయం కాదు. ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేకుండా కాలినడకతో సుదూరం వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్లిన వారు శివుడిపైనే భారం వేసి కొండలు ఎక్కాలని భక్తులు అంటారు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ చాలా మంది దేశ, విదేశాల నుంచి అమర్ నాథ్ యాత్ర చేస్తారు. తాజాగా సౌత్ నటి సాయి పల్లవి అమర్ నాథ్ యాత్ర చేశారు. ఎంతోకాలంగా ఈ యాత్ర చేయాలని అనుకుంటున్నానని, శివయ్య అండతో యాత్ర పూర్తి చేశానని అన్నారు.
అయితే ఈ యాత్ర చేసే సమయంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదురయ్యాయని తెలిపింది. వయసు మళ్లిన తన తల్లిదండ్రులు ఆయాస పడ్డారని అన్నారు. ఓ కొండ ఎక్కేటప్పుడు ఎంతో అయాస పడ్డారని, ఈ సమయంలో ఛాతిని పట్టుకొని వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. శివుడిని దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఎంతో మంది ఇలాగే కష్టాలు పడడం చూశానని అన్నారు. దీంతో దేవుడా.. నీవెందుకు ఇంతదూరంలో ఉన్నావ్.. అని ఆమె ఇందులో రాసుకొచ్చారు.
యాత్రి పూర్తి చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఎంతో మంది ఓం నమశ్శివాయ.. అంటూ శివ నామస్మరణం చేసుకుంటూ కొండ ఎక్కుతున్నారు. వారిని చూడగానే మేం పడ్డ కష్టం అంతా మరిచిపోయాం. దేవుడి అండ ఉంటే యాత్ర చేయడం పెద్దగా కష్టం అనిపించదు అని సాయి పల్లవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్ స్ట్రాగ్రాం ఖాతాలో యాత్రకు సంబంధిచిన ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేశారు.