
డ్యాన్సర్ నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది యువ నటి సాయి పల్లవి. దక్షిణాదిలో ఇప్పుడామె బిజీ హీరోయిన్. బోల్డ్ క్యారెక్టర్లకు, స్కిన్ షోకు దూరంగా ఉంటున్నా ఆమెను వెతుక్కుంటూ వరుస ఆఫర్లు వస్తున్నాయి. సాధారణంగా హీరో హీరోయన్లకు నటనతో పాటు మంచి డ్యాన్స్ కూడా వస్తే వాళ్ల కెరీర్కు ప్లస్ అవుతుంది. మంచి డ్యాన్సర్ కూడా కావడంతో సాయి పల్లవికి తిరుగులేకుండా పోయింది. నటనతో పాటు డ్యాన్స్‌తోనూ ప్రేక్షకులను ఫిదా చేస్తోందీ అమ్మాయి. ఇప్పటిదాకా ప్రభుదేవా, లారెన్స్ లాంటి కొరియోగ్రాఫర్స్ హీరోలుగా రాణించారు. అయితే, డ్యాన్సర్ నుంచి హీరోయిన్‌గా ఎదిగిన వాళ్లలో సాయి పల్లవి ముందుంది. ఈ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’లో పార్టిసిపేట్ చేసిన సాయి పల్లవి.. మరికొన్ని డ్యాన్స్ షోస్‌లో కూడా పాల్గొని మూవీ మేకర్స్ దృష్టిలో పడింది. అలా, మలయాళ ‘ప్రేమమ్’తో తెరంగేట్రం చేసిన ఆమె అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకుంది లేదు. మంచి నటన, అద్భుతమైన డ్యాన్సర్గా పేరు తెచ్చుకుంది. డ్యాన్స్‌కు ఏ మాత్రం అవకాశం ఉన్నా తనలోని డ్యాన్సర్ను నిద్రలేపి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ‘మారి 2’ మూవీలో రౌడీ బేబీ సాంగ్‌కు ఆమె వేసిన స్టెప్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.

Also Read:- Sai Pallavi is a Malayali ???
అలాగే, ‘ఫిదా’ మూవీలో వచ్చిండే మెల్లగ వచ్చిండే సాంగ్‌లో కూడా తన నాట్యంతో పాటు అభినయంతో పల్లవి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. పాటలో కూడా సున్నితమైన భావోద్వేగాలు ఉండేలా చూసు కున్నాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల,నాగ చైతన్య సాయి పల్లవి,కాంబినేషన్ లో వస్తున్నా కొత్త చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇప్పటికే షూటింగ్ పూర్తయి రిలీజ్‌కు రెడీ ఉంది. లాక్‌డౌన్ లేకపోతే సమ్మర్లోనే ఈ మూవీ విడుదలయ్యేది. నటీనటుల్లోని టాలెంట్‌ను గుర్తించి దాన్ని తెరపైన చూపించడంలో ముందుండే శేఖర్ కమ్ముల… సాయి పల్లవి డ్యాన్సింగ్ స్కిల్స్‌తో మరోసారి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఫిదా మాదిరిగా లవ్‌స్టోరీలో కూడా ఓ ప్రత్యేక పాటను ప్లాన్ చేశాడట. కథలో ఇమిడిపోయే ఈ పాటలో సాయి పల్లవి అద్భుతమైన అభినయంతో స్టెప్పులు వేసిందట. ఫిదాలోని వచ్చిండే ను మించేలా ఈ పాట ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటకు సాయి పల్లవే స్వయంగా కొరియోగ్రఫీ చేయడం మరో స్పెషాలిటీ.