https://oktelugu.com/

Sai Pallavi : రామాయణంలో సీతగా సాయి పల్లవి.. తొలిసారి స్పందించింది

కాగా రామాయణం మూవీ మూడు భాగాలుగా విడుదల కానుందట. ఇక రాముడిగా ప్రధాన పాత్ర రన్బీర్ కపూర్ నటించే అవకాశం కలదంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2023 / 09:30 PM IST
    Follow us on

    Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల న్యూస్ చక్కర్లు కొట్టింది. అది కూడా భారీ పాన్ ఇండియా చిత్రంతో. దర్శకుడు నితీష్ తివారి రామాయణం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో సీత పాత్ర కోసం సాయి పల్లవిని ఎంచుకున్నారు కథనాలు వెలువడ్డాయి. ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అదే సమయంలో సాయి పల్లవి కూడా స్పందించలేదు. దీంతో అనుమానాలు ఏర్పడ్డాయి. రామాయణంలో సీతగా నటించబోతున్నట్లు స్వయంగా వెల్లడించింది.

    దర్శకుడు నితీష్ తివారి సీత పాత్రకు నన్ను ఎంచుకోవడం గొప్ప విషయం అని సాయి పల్లవి అన్నారు. ఇక కథ వినేందుకు ముంబై వెళుతున్నట్లు ఆమె చెప్పారు. అలాగే ఎందరో గొప్ప నటీమణులు సీత పాత్రను అద్భుతంగా చేశారు. వారు చేసిన దాంతో 10 శాతం నేను చేసినా న్యాయం చేసినట్లే అన్నారు. ఇక చాలా మంది రామాయణం సినిమాలుగా తెరకెక్కించారు. వాల్మీకి సంపూర్ణ రామాయణం మాత్రం ఎవరూ పూర్తిగా తెరపై ఆవిష్కరించలేదు. ఆ లోటు మా చిత్రం తీరుస్తుందని భావిస్తున్నట్లు ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

    కాగా రామాయణం మూవీ మూడు భాగాలుగా విడుదల కానుందట. ఇక రాముడిగా ప్రధాన పాత్ర రన్బీర్ కపూర్ నటించే అవకాశం కలదంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల సాయి పల్లవికి బ్రేక్ వచ్చింది. సినిమాలు మానేసిందంటూ ప్రచారం జరిగింది. ఇటీవల తెలుగులో భారీ ప్రాజెక్ట్ ప్రకటించింది. నాగ చైతన్యకు జంటగా నటిస్తుంది. కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి ఈ చిత్ర దర్శకుడు. గీతా ఆర్ట్స్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.

    ఇక ప్రేమమ్ మూవీతో సాయి పల్లవి హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం ఫిదా. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్. ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ చిత్రాలతో సాయి పల్లవి తెలుగులో స్టార్ అయ్యింది.