Sai Pallavi- Mahesh Babu: హోమ్లీ బ్యూటీ సాయి పల్లవి సూపర్ స్టార్ మహేష్ పై హాట్ కామెంట్ చేసింది. ఆయన గ్లామర్ కి పడిపోయిన ఆమె ప్రశంసలతో ముంచెత్తింది. సాయి పల్లవి లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఫలానా స్టార్ తో నటించాలని నేను ఎప్పుడూ అనుకోను. కథ నచ్చితే ఎవరితో అయినా సినిమా చేస్తాను. సినిమా ఆఫర్ వస్తే కథ చెప్పమంటాను కానీ హీరో ఎవరని అడగను. పరిశ్రమలో ఉన్న అందరు హీరోలపై నాకు గౌరవం ఉంది. అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టమని సాయి పల్లవి వెల్లడించారు.

అనంతరం మహేష్ గురించి ఆమె కొంచెం క్రేజీ కామెంట్ చేశారు. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. ఆయన్ని చూశాక మగాళ్లు కూడా ఇంత అందంగా ఉంటారా? అని ఆశ్చర్యం కలిగిందని సాయి పల్లవి చేశారు. మహేష్ గ్లామర్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన అందాన్ని ఎందరో సెలెబ్రిటీలు పొగిడారు. వారి లిస్ట్ లో ప్రస్తుతం సాయి పల్లవి చేరారు. అలాగే సాయి పల్లవి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
సాయి పల్లవి పూర్తి శాఖాహారి అట. ఆమెకు పప్పు, అన్నం ఉంటే చాలట. సెట్స్ లో కూడా కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఇస్తే చాలు ఇంకేమీ అవసరం లేదని ఆమె తెలియజేశారు. వ్యాయామం చేయను, ఎప్పుడైనా అమ్మతో బ్యాడ్మింటన్ ఆడుతాను. నేను త్వరగా బరువు పెరిగే అవకాశం లేదని సాయి పల్లవి అన్నారు. డాన్స్, నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదట. తాను సహజంగా ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే కెమెరా ముందు నటిస్తారట. అతిగా మేకప్ వేసుకోవడం కూడా ఇష్టం ఉండదని సాయి పల్లవి చెప్పారు.

కెరీర్ బిగినింగ్ లో అనేక సందేహాలు వెంటాడాయట. అందరు హీరోయిన్స్ మాదిరి నేను అందంగా ఉండను, ముఖంపై మొటిమలు, హీరోయిన్ మెటీరియల్ కూడా కాను, ఎలా రాణిస్తాను అనే ఆలోచనలు వెంటాడేవి. ప్రేమమ్ సినిమా హీరోయిన్ గా ఎంపిక కావడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మధ్యలో తీసేస్తారేమో అనిపించేది. అదే విషయాన్ని దర్శకుడిని పదే పదే అడిగేదాన్ని. ప్రేమమ్ దర్శకుడు నాలో ఆత్మవిశ్వాసం కలగజేశాడని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. కాగా ఈ నేచురల్ బ్యూటీ కొత్త సినిమాలు ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.