Sai Pallavi: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడు యూత్ లో విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి..ఫిదా సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన సాయి పల్లవి తొలి సినిమా తోనే సెన్సషనల్ హిట్ కొట్టి ప్రేక్షకుల మనసుని దోచేసింది..మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే గ్లామర్ షో చెయ్యడానికి అసలు ఆసక్తి చూపించకపోయిన కూడా సాయి పల్లవి అంటే యూత్ వెరెక్కిపోవడానికి కారణం ఆమె టాలెంట్ వల్లే..సాయి పల్లవి రేంజ్ లో ప్రస్తుతం డాన్స్ వేసే హీరోయిన్ సౌత్ ఇండియా లో ఎవ్వరు లేరు అని చెప్పొచ్చు..ఆమె డాన్స్ వేస్తె నెమలి నర్తించినట్టే అనిపిస్తుంది..ఇక నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఏ పాత్రని అయినా అలవోకగా నటించేస్తుంది..ఆమె నటనకు ఫిదా అవ్వని సినీ అభిమాని ఉండదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..అందుకే సాయి పల్లవి కి ఇండస్ట్రీ లో అంత క్రేజ్ వచ్చింది..అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యడం సాయి పల్లవి కి అసలు నచ్చదు..తన పాత్రలో దమ్ము ఉంటేనే ఆమె సినిమా సైన్ చేస్తుంది..ఆమె పాత్రలో బలం లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సరసన ఛాన్స్ వచ్చినా నటించదు.

Also Read: Rajamouli New Experiment On Mahesh: మహేష్ పై రాజమౌళి సరికొత్త ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా?
ఇటీవల సాయి పల్లవి విషయం లో అలాంటి సంఘటనే ఒకటి జరిగింది..ఇక అసలు విషయానికి వస్తే సాయి పల్లవి ఈమధ్య కాలం లో ఒక ప్రముఖ తమిళ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసారు..అయితే ఈ ప్రాజెక్ట్ నుండి సాయి పల్లవి తప్పుకున్నట్టు తెలుస్తుంది..ఎందుకంటే తానూ సైన్ చేసే ముందు డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ కి..సెట్స్ మీదకి వచ్చిన ఆయన తీస్తున్న దానికి అసలు సంబంధమే లేదట..దీనితో తీవ్రమైన అసహనం కి గురైన సాయి పల్లవి వెంటనే షూటింగ్ జరుగుతన్న స్పాట్ నుండే వాక్అవుట్ అయ్యిందట..ఆ తర్వాత నిర్మాత గారికి కాల్ చేసి ఈ సినిమా నేను చెయ్యడం లేదు అని చెప్పి..ఆయన ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేసిందట సాయి పల్లవి..ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..సాయి పల్లవి నిర్మాతలకు చాలా అనుకూలంగా ఉంటుంది..తన స్టాఫ్ కి ఇచ్చే శాలరీ దగ్గర నుండి ఆమెకి అయ్యే ఖర్చులన్నీ కూడా తన సొంత డబ్బులతోనే ఖర్చుపెట్టుకుంటుంది..నిర్మాతకి ఇంత సహకరించే సాయి పల్లవి,నిజాయితీ విషయం లో తేడా వస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ గా తీసుకోవచ్చు..ఇక సాయి పల్లవి ఇటీవలే రానా దగ్గుపాటి తో కలిసి విరాటపర్వం అనే సినిమాలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..కమర్షియల్ గా ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కూడా విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది..ముఖ్యంగా సాయి పల్లవి నటనకి అద్భుతమైన మార్కులు పడ్డాయి.

Also Read: Reliance : రిలయన్స్ కొత్త సైడ్ బిజినెస్.. బిట్రీష్ వాళ్ల రుచులు ఇక ఇండియాలో..